Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యం అందించిన వ్యక్తి కథ 'ఆకాశం నీ హద్దురా'

By:  Tupaki Desk   |   26 Oct 2020 7:00 AM GMT
ట్రైలర్ టాక్: సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యం అందించిన వ్యక్తి కథ ఆకాశం నీ హద్దురా
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ''సూరారై పొట్రు''. టాలీవుడ్ లో సూర్యకు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా కారణంగా థియేటర్స్ మూతబడి ఉండటంతో 'ఆకాశం నీ హద్దురా' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ముందుగా అక్టోబ‌ర్ 30న విడుదల చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

'వ్యవసాయం చేసే వాడు విమానం ఎక్కుతాడు' అని ట్రైలర్ లో చెప్పడం ద్వారా ఇది సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యం అందించిన వ్యక్తి కథ అని అర్థం అవుతోంది. 4 కోట్లు పెట్టి విమానం కొని, టికెట్ ధర ఒక్క రూపాయి పెట్టి అందరూ విమాన ప్రయాణం చేయడానికి హీరో సంకల్పించినట్లు చూపించారు. దీని కోసం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని, జీవితంలో ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్ అనిపించుకున్నాడు అనేది ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సూర్య మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారక్టర్ ప్లే చేసాడని అర్థం అవుతోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి - కరుణాస్ - వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ గునీత్ మోంగా మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.