షాకింగ్: విమానాశ్రయంలో దిగిన మేల్ సఖి!

Wed Jan 26 2022 21:29:19 GMT+0530 (IST)

Aadhi Pinisetti Latest Photo

హైదరాబాద్ లో దేవుడు దిగాడు! కాదు కాదు నారదుడు దిగాడు ..! దేవేంద్రుడో యముడో గండరగండడో ఎవరో ఒకరు దిగారు. ఆ రూపం  కిరీటధారణ చూస్తే ఇలాంటి డౌట్లు పుట్టుకురావడం సహజం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇలా దిగాడు ఆది పినిశెట్టి.ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? అసలు ఈ వేషధారణ ఏమిటీ? అంటూ అందరిలో ఒకటే సందేహం. విమానాశ్రయంలో సిబ్బందితో పాటు చుట్టూ జనం కూడా నోరెళ్లబెట్టారు. నేరుగా విమానం దిగుతూనే కిరీటంతో చేతిలో బిగ్ సైజ్ ట్రాలీ సూట్ కేసుతో కనిపించాడు. స్టైల్ గా గాగుల్స్ పెట్టుకున్న నారద మహర్షిలానే ఉన్నాడు.

అయితే ఈ గెటప్ వెనక అసలు రహస్యం ఆది పినిశెట్టి ట్విట్టర్ లో  వెల్లడించాడు. హైదరాబాద్..!! ఇదంతా మోస్తున్నా.. రెడ్ హార్ట్ సఖి నిజంగా చాలా లక్కీ.. @ కీర్తి అంటూ వెల్లడించాడు. ఆది పినిశెట్టి -జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కరోనా క్రైసిస్ వల్ల పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ నటించిన `గుడ్ లక్ సఖి` ఈనెల 28న థియేటర్లలో విడుదలవుతోంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.