Begin typing your search above and press return to search.

ఖాన్ ల త్ర‌యంతో ఏ.ఆర్.మురుగదాస్ బిగ్ ప్లాన్!

By:  Tupaki Desk   |   19 July 2022 4:42 AM GMT
ఖాన్ ల త్ర‌యంతో ఏ.ఆర్.మురుగదాస్ బిగ్ ప్లాన్!
X
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ అంత‌కంత‌కు హీటెక్కిస్తోంది. ప్రాంతీయ భాష‌ల నుంచి పాన్ ఇండియా స్టార్ల అసాధార‌ణ విజ‌యాలు బాలీవుడ్ కి మింగుడు ప‌డ‌డం లేదు. ఫ‌లితంగా ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌ స‌రికొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర తీస్తోంది. ఇండ‌స్ట్రీలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సూప‌ర్ స్టార్లు ఇత‌ర భాష‌ల స్టార్ల‌ను క‌లుపుకుని భారీ యూనివ‌ర్శ్ (విశ్వం) లు మ‌ల్టీవ‌ర్శ్ లు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఖాన్ ల త్ర‌యం కూడా చేతులు క‌లుపుతోంది. ఇప్ప‌టికే టైగ‌ర్.. ప‌ఠాన్... బ్ర‌హ్మాస్త్ర లాంటి యూనివ‌ర్శ్ త‌ర‌హా కాన్సెప్ట్ మూవీస్ గురించి చ‌ర్చ సాగుతోంది.

అదే విధంగా ఇప్పుడు సౌతిండియా స్టార్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్.మురుగ‌దాస్ భారీ యూనివ‌ర్శ్ కి తెర‌లేప‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తొలిగా అత‌డు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్- కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ ల‌ను క‌లిపి భారీ చిత్రాన్ని ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నారు.AR మురుగదాస్ సినిమా కోసం ఇద్ద‌రు పెద్ద‌ ఖాన్ లను క‌లిపేందుకు అమీర్ ఖాన్ స‌హాయం చేసారన్న‌ది కూడా ఆస‌క్తిని పెంచుతోంది. ఇండ‌స్ట్రీ అగ్ర హీరోలైన ఇద్ద‌రు ఖాన్ లు ఒకే చిత్రంలో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడం ఎంతో ఉత్కంఠ‌ను పెంచే అంశం. ఇది కోట్లాది మంది అభిమానుల క‌ల‌ను నిజం చేయ‌డ‌మే. అది అమీర్ ఖాన్ వ‌ల్ల సాధ్య‌మ‌వుతోంద‌ని టాక్ వినిపిస్తోంది.

చూస్తుండ‌గానే అంతా మారిపోతోంది. యూనివ‌ర్శ్ ల పేరుతో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో అగ్ర హీరోల‌ను క‌ల‌ప‌డం ఇప్పుడు ద‌ర్శ‌కుల‌కు సాధ్య‌మ‌య్యే పని. విశ్వం కాన్సెప్ట్ లు అభిమానుల డిమాండ్లను నెర‌వేరుస్తాయన్న భ‌రోసా ఉంది. AR మురుగదాస్ కూడా ఇలాంటి ఆలోచ‌న‌ల‌తోనే ఉన్నారు. తొలిగా అత‌డు స‌ల్మాన్- షారూక్ జోడీతో కలిసి పనిచేస్తార‌ని కొన్నాళ్లుగా క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ సాధ్య‌ప‌డలేదు. తాజా స‌మాచారం ప్రకారం.. ఇండ‌స్ట్రీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లను ఒకచోటికి తీసుకురావ‌డానికి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నారు.

పఠాన్- టైగర్ 3 చిత్రాలలో స‌ల్మాన్ - షారూక్ జోడీ ఒక‌రికోసం ఒక‌రు అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ 1995లో 'కరణ్ అర్జున్' చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. తరువాత SRK న‌టించిన 'ఓం శాంతి ఓం'లో స‌ల్మాన్ ప్రత్యేక పాత్ర‌లో కనిపించారు. కొన్నేళ్లుగా అభిమానులు వారిని పూర్తి పాత్ర‌ల్లో ఒకే సినిమాలో చూడాల‌ని భావిస్తున్నారు. అలాంటి వారికి తాజా వార్త‌లు ఎంతో ఆనందాన్నిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ క‌ల‌ను సాకారం చేస్తున్న‌ది మాత్రం అమీర్ ఖాన్.

మ‌రో గుస‌గుస ప్ర‌కారం.. ఇటీవ‌ల ఏ.ఆర్.మురుగ‌దాస్ యూనివ‌ర్శ్ కాన్సెప్టుల‌పై లోతుగా అధ్య‌య‌నం చేశార‌ని తొలుత స‌ల్మాన్ - షారూక్ ల‌ను క‌లిపి సినిమా తీసి దీనికి కొన‌సాగింపు భాగంలో అమీర్ ఖాన్ పాత్ర‌ను కూడా జోడిస్తార‌ని.. ఈ 'విశ్వం' ఇంకా ఆరంభ ద‌శ‌లో ఉంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లతో సినిమా తీయాలనుకుని AR మురుగదాస్ స్క్రిప్టు ప‌నులు ప్రారంభించారు. తరువాత త‌న గ‌జిని హీరో అమీర్ ఖాన్ ను సంప్రదించినప్పుడు తక్షణమే ఆ ఇద్ద‌రితో సమావేశాన్ని ఏర్పాటు చేశార‌ట‌. ఖాన్ ల కాంబినేష‌న్ మూవీకి ఇప్ప‌టికే లైన్ వినిపించిన మురుగ‌దాస్ స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నార‌ని తెలిసింది. ప్రాజెక్ట్ 2023 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.

పఠాన్ కాకుండా షారూఖ్ ఖాన్ రాజ్‌కుమార్ హిరానీ డుంకీలో న‌టిస్తున్నారు. అట్లీ కుమార్ జవాన్ ని పూర్తి చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భాయిజాన్ (ఇంతకు ముందు కభీ ఈద్ కభీ దీపావళి) .. నో ఎంట్రీ 2.. బజరంగీ భాయిజాన్ 2 .. కిక్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ లు కాకుండా SRK- సల్మాన్ క‌థానాయ‌కులుగా ఆదిత్య చోప్రా నిర్మాత‌గా ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ప్రాజెక్ట్ గురించి చర్చలు సాగుతున్నాయి. ఇది ఇంకా ఆరంభ ద‌శ‌లోనే ఉంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఏదీ అధికారికంగా ధృవీకరించలేదు.