రావణాసురకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Fri Mar 31 2023 19:02:06 GMT+0530 (India Standard Time)

AP government bumper offer to Ravanasura

మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ చిత్రం రవితేజ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. టీజర్ విడుదల అయినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి.ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ నటించారు. వారి పాత్రలు ఏంటి.. ఎందుకు అంత మంది హీరోయిన్స్ నటించారు అనేది ఆసక్తికర విషయంగా మారింది. అంతే కాకుండా రవితేజ పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉండబోతుందని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోస్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

ఈ సినిమా లో రవితేజ లాయర్ అంటూనే క్రైమ్స్ చేసే పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఏపీలో అదనపు షోలకి అనుమతించినట్లుగా తెలుస్తోంది. ఎంపిక చేసిన థియేటర్స్ లో సినిమా ప్రత్యేక షో ను ప్రదర్శించబోతున్నారు.

రావణాసుర ఎర్లీ మార్నింగ్ షో స్ కి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు బీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ లో అభిషేక్ నామ నిర్మించారు.

రవితేజ గత చిత్రం ధమాకా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా మరో విజయాన్ని రవితేజ కి అందించడం ఖాయమని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.