Begin typing your search above and press return to search.

AMB మాస్ట‌ర్ స్ర్టాట‌జీ కి వాళ్లంతా ఔట్!

By:  Tupaki Desk   |   29 Jun 2022 3:30 AM GMT
AMB మాస్ట‌ర్ స్ర్టాట‌జీ కి వాళ్లంతా ఔట్!
X
అత్యాధునిక మ‌ల్టీప్లెక్స్  ఏఎంబీ సినిమాస్-మాల్  ప్ర‌త్యేక‌త‌లు చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌సాద్ ఐమాక్స్ త‌ర్వాత‌ హైద‌రాబాద్ లోనే బెస్ట్  థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ని అందిస్తుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌-ఏషియ‌న్ సినిమాస్ జాయింట్ వెంచ‌ర్ భాగ‌స్వామ్యంలో నిర్మాణ‌మైన ఎంఎంబీ ఇప్పుడు ఎంతో ప్ర‌ఖ్యాత గాంచిన మాల్ గా పేరుగాంచింది.

ఐటీ కారిడార్ మొత్తాన్ని ఎఎంబీ క‌వ‌ర్  చేసేస్తోంది. టాలీవుడ్ మొత్తం ఏఎంబీ వైపు చూసేలా కొత్త కొత్త బిజినెస్ స్ర్టాట‌జీతో ఎఎంబీ బ‌లంగా వెళ్లూనుకూనే ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ సినిమా ప్ర‌మోష‌న్ కి ఎఎంబీ మాల్ ఓ హబ్ గా మారిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌లి కాలంలో సినిమా టీజ‌ర్లు..ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మాల్ని ఎంఎంబీలోనే ఎక్కువ‌గా నిర్వ‌హిస్తున్నారు.

 మీడియా ప్ర‌చారానికి అన్ని ర‌కాల‌ వెసులు బాటులు ఎఎంబీ క‌ల్పించ‌డంతో ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఏఎంబీ వైపై చూస్తున్నారు. వీట‌న్నింటికి  మంచి  చౌక ధ‌ర‌లోనే ప్ర‌చారం అనుభ‌వాన్ని ఎంఎబీ క‌ల్పించ‌డం విశేషంగా చెప్పొచ్చు. ఇత‌ర మ‌ల్టీప్లెక్స్ లోతో పోల్చుకుంటే ఏఎంబీ 1.1 ల‌క్షల‌కే స్క్కీన్ సేవ‌లు అందిస్తుంది.  ఏఎంబీలో టీజ‌ర్..ట్రైల‌ర్ లాంచ్ చేసుకోవాలంటే 1.1 ల‌క్ష చెల్లిస్తే చాలు ట్రైల‌ర్ స‌హా మీడియా క‌వ‌రేజ్ పూర్త‌వుతుంది.

అదే పీవీఆర్ లో లాంచ్ చేయాలంటే అక్ష‌రాల 2.75 లక్ష‌లు చెల్లించాల్సిందే. ఏఎంబీతో పొల్చుకుంటే అద‌నంగా 75 వేలు చెల్లించాలి. థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ అంత‌గా ఉండ‌దు! అన్న నెగిటివ్ ఇమేజ్ సైతం వాటిపై ఉంది. ఇంకా సిటీలో మ‌రికొన్ని మ‌ల్టీ ప్లెక్స్ ల్లోనూ అంతే మొత్తం చెల్లించి సినిమాని ఈవెంట్లు చేయాల్సి ఉంది. మ‌రి ఏఎంబీ ఎందుకింత త‌క్కువ ధ‌ర‌కే కల్పిస్తుంది! అంటే  దాని వెనుక  మార్కెట్ స్ర్టాట‌జీనే క‌నిపిస్తుంది.

ఏఎంబీని వీలైనంతగా మార్కెట్ లోకి తీసుకెళ్లాల‌ని నిర్వాహ‌కులు బ‌లంగా సంక‌ల్పించిన‌ట్లు తెలుస్తుంది. ఏఎంబీ ప్ర‌త్యేకత కామ‌న్ మ్యాన్ కి సైతం తెలియాలి. వాస్త‌వానికి ఏఎంబీ లాంచింగ్ స‌మ‌యంలో అధిక ధ‌ర‌లు ఉన్నాయ‌నే విమ‌ర్శ అప్ప‌ట్లోనే తెర పైకి వ‌చ్చింది. దీంతో ఏఎంబీ  సామాన్యుడికి దూరం అవుతుంద‌ని ప్ర‌చారం సాగింది.

సినిమా ఈవెంట్లు  నిర్వ‌హించాలంటే అద్దె సైతం భారీగానే చెల్లించాల్సి వ‌స్తోంద‌ని వ్యాపార వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. ఇప్పుడా లె క్కలు అన్నింటిని స‌రి చేయ‌డానికి మిగ‌తా మ‌ల్టీప్లెక్స్ లు క‌న్నా ధ‌ర‌ల విష‌యంలో వెసులుబాటు కల్పిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది వ‌ర్కౌట్ అయితే మిగ‌తా వాటి వేగం త‌గ్గుతుంద‌ని తెలుస్తోంది.