Begin typing your search above and press return to search.

AHA వెబ్ సిరీస్ మోహ‌న్ బాబుతోనా?

By:  Tupaki Desk   |   21 Oct 2021 7:31 AM GMT
AHA వెబ్ సిరీస్ మోహ‌న్ బాబుతోనా?
X
సినిమాలు వేరు..రాజ‌కీయం వేరు. అక్క‌డివి ఇక్క‌డికి తీసుకురాకూడ‌దు. ఇక్క‌డివి అక్క‌డికి మోసుకెళ్ల‌కూడ‌దు అనేది సినిమా వాళ్ల నినాదం. రాజ‌కీయంగా లేదా..ఇత‌ర రంగాల్లో ఎన్ని వివాదాలు ఉన్నా క‌ళామత‌ల్లి వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి అన్ని మ‌ర్చిపోయి అంతా క‌లిసి మెలిసి ఉండాల‌న్న‌ది తెలుగు హీరోలు..నిర్మాత‌లు..ద‌ర్శ‌కులు..ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఓ నిబంధ‌న‌గా భావిస్తారు. వ్య‌క్తిగ‌త విష‌యాలు..వైశ‌మ్యాల‌కు పోయి ప‌రిశ్ర‌మ‌ని చీల్చ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ను అంతా తూ.చ త‌ప్ప‌కుండా పాటించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఆ నిబంధ‌న‌ని మెగా నిర్మాత అల్లు అర‌వింద్ సరైన పంథాలోనే పాటిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది.

మెగా ఫ్యామిలీ అంటే గిట్ట‌నివారిగా పాపుల‌రైన కొంద‌రు స్టార్ల‌ను ఇప్పుడు అర‌వింద్ `ఆహా` వేదిక‌గా ఒకే తాటిపైకి తీసుకొస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి వైషామ్యాలు ఉన్నా వాటితో సంబంధం లేకుండా ఎంట‌ర్ టైన్ మెంట్ అనే వేదిక‌పై అంద‌రినీ ఏకం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి స్వ‌యానా బావ‌మ‌ర‌ది అల్లు అరవింద్. ఇటీవ‌లే నంద‌మూరి బాల‌కృష్ణ తో ఆహాలో ఓ ఇంట‌ర్వ్యూ ప్రోగ్రామ్ చేయించిన సంగ‌తి తెలిసిందే. దానికి సంబంధించిన ఈవెంట్ ని అర‌వింద్ గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసారు. బాల‌య్య‌కి-చిరంజీవి కి మ‌ధ్య సినిమా-రాజ‌కీయాల మ‌ధ్య కాంపిటీష‌న్ ఎలా ఉన్నా వాటితో సంబంధం లేకుండా అర‌వింద్ త‌న ప్రోగ్రామ్ ని స‌క్సెస్ చేసారు.

అలాగే నాగార్జున‌-బాల‌య్య ల‌ను ఒకే వేదిక‌పైకి తేవాల‌నే ప్లాన్ ఉంది. ఆ ఇద్ద‌రినీ ఆహా వేదిక‌పై చూసుకుని ఆనంద‌ప‌డాల‌ని అర‌వింద్ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ప్ర‌చారం ఉంది. తాజాగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ని కూడా రంగంలోకి దించాల‌ని అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారుట‌. `ఆహా` కార్య‌క్ర‌మానికి ఆయ‌న్ని గ్రాండ్ గా ఆహ్వానించాల‌ని ఆలోచ‌న చేస్తున్నారుట‌. ఒక త‌మిళ నిర్మాత రాసిన వెబ్ సిరీస్ కోసం మోహ‌న్ బాబు ని గెస్ట్ గా పిలిచి సిరీస్ ని లాంచ్ చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మ‌రి ఇది వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో ఇప్ప‌టికి క్లారిటీ లేదు. ఇప్ప‌టికే మంచు ల‌క్ష్మీ `ఆహా`లో ఓ కార్య‌క్ర‌మం చేస్తున్న క్ర‌మంలో మంచు మోహ‌న్ బాబు విచ్చేస్తార‌నే భావిస్తున్నారు. ఇటీవ‌ల `మా` ఎన్నిక‌ల్లో త‌న‌యుడు మంచు విష్ణు అధ్య‌క్షుడైన క్ర‌మంలో ఎంబీకి కూడా ఈ వేదిక స‌రికొత్త ఎత్తుల‌కు ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తోంది ఒక వర్గం.