Begin typing your search above and press return to search.

ఆర్జీవీకి ఏం సినిమాలు తీయాలో చెప్పిన ఏబీఎన్ ఆర్కే?

By:  Tupaki Desk   |   16 Jan 2022 5:08 AM GMT
ఆర్జీవీకి ఏం సినిమాలు తీయాలో చెప్పిన ఏబీఎన్ ఆర్కే?
X
రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద దర్శకుడు ఫక్తు ఏపీ సీఎం జగన్ అభిమానిగా ఉన్నారు. అయితే ఎందుకో గానీ సినిమా టికెట్ల వివాదంలో ఏపీ ప్రభుత్వం నచ్చక ఈ మధ్య బయటపడ్డాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ ఏపీ సర్కార్ ను ప్రశ్నించాడు. గతంలో జగన్ కు మద్దతుగా.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా తీసి టీడీపీ అధినేతను ఇరుకునపెట్టారు. చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీశారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉండడంతో వర్మ సినిమా టికెట్ల వివాదంపై ప్రశ్నించడం ప్రత్యర్థులకు వరమైంది. దాన్ని ఇప్పుడు అందరూ హైలెట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆర్జీవీకి అసలు ఇప్పుడు ఏం సినిమాలు తీయాలో సూచించాడు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును తీసుకెళ్లి కాళ్లు వాచిపోయేలా కొట్టిన ఉదంతంపై ఎందుకు సినిమా తీయకూడదు అని వర్మకు ఏబీఎన్ ఆర్కే సూచించాడు. దానికి వర్మ ‘అది చిన్న లైన్ అని.. రెండు గంటల సినిమా సరిపోదని’ బదులిచ్చాడు. దీనికి ఆర్కే అంతే సరదాగా స్పందించాడు. ఆర్జీవీకి కథ ఓ లెక్కనా? ‘ఓ నైట్ ఓడ్కా వేసి ఆలోచిస్తే కథ అదే వచ్చేస్తుందని’ ఆర్కే పురిగొల్పారు. అంత లేదంటూ వర్మ తప్పించుకున్నాడు.

ఇక మీకో హర్రర్ ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెబుతానని చేస్తావా? అని ఆర్కే తాజాగా వర్మను అడిగాడు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య మీద సినిమా తీయవచ్చు కదా అని ప్రశ్నించాడు. జగన్ అంటే భయం అందుకే ఆ సినిమా తీయరు అంటూ ఆర్జీవీని కాస్త గట్టిగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆర్కే.

ఇలా వర్మకు కావాల్సిన జగన్ వ్యతిరేక సినిమాల హింట్ ఇచ్చి మరీ ఉసిగొల్పాడు ఏబీఎన్ ఆర్కే. కానీ వర్మ ఫక్తు జగన్ కు అభిమానిగా ఉండడంతో ఆ సినిమాలు తీసే సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ వర్మ ఇగో హర్ట్ అయ్యి ఓ ఫైన్ మార్నింగ్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రత్యర్థుల మాటలకు స్ఫూర్తి అయ్యి తీసినా తీస్తాడేమో.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.