Begin typing your search above and press return to search.

జూనియర్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరో

By:  Tupaki Desk   |   30 May 2023 9:32 AM GMT
జూనియర్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరో
X
టాలీవుడ్ లో టైర్ 2 హీరోల లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వారిలో నితిన్ కూడా ఉంటాడు. ఈ యంగ్ హీరో కి స్ట్రాంగ్ కంటెంట్, బలమైన పాత్ర పడితే తన పెర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తాడు. అయితే స్టొరీ సెలక్షన్ విషయంలో ఒక్కోసారి దెబ్బతింటూ ఉంటాడు. ఈ కారణంగా టాలీవుడ్ లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్న హీరో గా నితిన్ ఉన్నారు.

అయితే ఇప్పుడిప్పుడే తన కథల ఎంపిక విధానం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ జెనరేషన్ ఆడియన్స్ ని కనెక్ట్ కావాలంటే కచ్చితంగా క్యారెక్టరైజేషన్ తో పాటు కంటెంట్ విషయంలో కొత్త దనం ఉండాలని డిసైడ్ అయ్యి వక్కంతం వంశీ తో సరికొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ క్యారెక్టర్ ఉంటుందంట.

ఒక ఫేమ్ ఉన్న స్టార్ హీరో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో నటించడం అంటే కచ్చితంగా కంటెంట్ లో కొత్తదనం తో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రతి సినిమా లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కనిపిస్తారు. ఆ మూవీ సక్సెస్, ఫెయిల్యూర్ తో వారికి సంబంధం ఉండదు. అలాగే పాలనా సినిమా లో నటించాం అనే పేరు కూడా ఉండదు.

సినిమా లో నటించాలనే పిచ్చి తో వచ్చేసి తరువాత జూనియర్ ఆర్టిస్ట్ లు గా మరి స్క్రీన్ పై కనిపించడం కోసం వారు చాలా ఆశపడుతూ ఉంటారు. ఒక్క సినిమా స్క్రీన్ మీద కనిపించిన హ్యాపీ గా ఫీల్ అయిపోతారు. అలాంటి సినిమా పిచ్చోడిగానే నితిన్ క్యారెక్టర్ ఉంటుందంట. దీనిని బట్టి ఈ మూవీ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అంచనా వేయవచ్చు.

దశాబ్దాలు గా ఇండస్ట్రీలో ఉన్న వక్కంతం వంశీ జూనియర్ ఆర్టిస్ట్స్ కష్టాలు, ఇష్టాలు కరెక్ట్ గా అర్ధం చేసుకొని ఈ సినిమాలో మంచి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారంట. సినిమా నేపథ్యంలో చాలా కథలు వస్తూ ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో కష్టాలని చూపిస్తూ, అందులో వినోదాన్ని అందించే కథలు చాలా తక్కువ. గతంలో పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ కష్టాల పై నేనింతే మూవీ చేశారు. మరల ఇప్పుడు వక్కంతం వంశీ ఎంటర్టైన్మెంట్ జోన్ లో నితిన్ తో ఈ మూవీ చేస్తూ ఉన్నారు.