మల్లయోధులకు సన్మానం.. అదే కదా పవన్ సహృదయత

Sun Feb 28 2021 21:00:01 GMT+0530 (IST)

A tribute to the wrestlers

ప్రతిభను ప్రోత్సహించడం వారి పనిని ప్రశంసించడమే గాక వీలు కుదిరితే సన్మానించడం పవన్ స్టైల్. ఇంతకుముందు గబ్బర్ సింగ్ రౌడీ గ్యాంగ్ కి అలానే సన్మానించి సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.నాటి గబ్బర్ సింగ్ గ్యాంగ్ ని ఎలా సత్కరించారో అలానే ఇప్పుడు తనతో కలిసి పని చేసిన మల్ల యోధుల్ని గౌరవించారు. అంతేకాదు వారికి సన్మానం చేయడం చర్చనీయాంశమైంది.పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పీరియడ్ చిత్రం చేస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి  ఉత్తరప్రదేశ్ నుండి కొంతమంది మల్లయోధులను తీసుకువచ్చారు. ఈ చిత్రంలో వారి యుద్ధ నైపుణ్యాలు నటన మెరుపులు మెరిపిస్తాయట. వారంతా ప్రతిభతో ఆకట్టుకోవడంతో పవన్ సత్కరించాలని నిర్ణయించుకున్నారట. అనుకున్నదే తడవుగా ఆ మల్లయోధులందరినీ హైదరాబాద్ లోని తన జనసేన పార్టీ కార్యాలయానికి పిలిచి అక్కడ సత్కరించారు. తన చిత్రంలో నటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ గొప్పతనం సహృదయత వారందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన ఒదిగి ఉండే స్వభావానికి మల్లయోధులంతా ఆశ్చర్యపోయారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేస్తారు. అలాగే ఈ సినిమా టైటిల్ ఆవిష్కరించనున్నారు. ఎ.ఎం.రత్నం ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళం- హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది.