బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ షాహిద్ కపూర్ ఈ మధ్య రొమాంటిక్ జానర్ కి దూరమవుతున్న సంగతి తెలిసిందే. 'కబీర్ సింగ్' తర్వాత 'జెర్సీ' లాంటి ఇనస్పైరింగ్ స్టోరీలో నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఈ సినిమా షాహిద్కి కొత్త గుర్తింపు ను తీసుకొచ్చింది. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ 'బ్లడీ డాడి'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో యాక్షన్ సినిమా చేసేందు కు సైన్ చేసాడు.
ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి మాలీవుడ్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నారు. మాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదగా ఉంటారు. ఇప్పుడా ఛాన్స్ రోషన్ తీసుకున్నారు. షాహిద్ కపూర్ కొరిక మేర కు అత ను హిందీలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. 'సెల్యూట్'..'కయంకులం కొచ్చీన్' చిత్రాలతో రోషన్ మంచి విజయాలు అందుకున్నాడు. మాలీవుడ్ లో పేరున్న దర్శకుడాయన. ఈనేపథ్యంలోనే షాహిద్ కపూర్ ఆయన్ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.
జీ స్టూడియోస్-రాయ్ కపూర్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా సినిమా వివరాలు షాహిద్ కపూర్ రివీల్ చేసారు. 'ఒక కేసులో భాగంగా పోలీస్ అధికారి చేసే ఉత్కంఠభరిత మైన పరిశోధనతో సాగే చిత్రమిది. యాక్షన్..థ్రిల్లర్..సస్పెన్స్..డ్రామా తో కూడిన కథలు దొరకడం చాలా రేర్. ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ లో చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నా' అన్నారు.
ఈ సినిమా 2023 చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. అన్ని పనులు పూర్తిచేసి 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ 'బ్లడీ డాడి' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీనికి అలీ అబ్బాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని జూన్ లో సినిమా రిలీజ్ కానుంది.