Begin typing your search above and press return to search.

రిలీజైన ఇరవై ఏళ్లకు రీమేకా?

By:  Tupaki Desk   |   3 May 2021 3:33 AM GMT
రిలీజైన ఇరవై ఏళ్లకు రీమేకా?
X
ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా రిలీజైన కొంత కాలంలోపే దాని స్టోరీకు వాల్యూ ఉంటుంది. తర్వాత కాలంలో పరిస్దితుల మారిపోతాయి. సామాజికంగా ఎన్నో మార్పులు వస్తాయి. అంతెందుకు ఇప్పుడు పాత సినిమాలు ఇప్పటికాలానికి మార్చి రీమేక్ చేయాలంటే సెల్ ఫోన్ అనేది పెద్ద అడ్డంకిగా మారుతుంది. సెల్ ఫోన్, జీపీ ఎస్ వంటి టెక్నాలిజీలు కథలోకి వస్తే చాలా కథలు సమూలంగా మారిపోతాయి. అసలు కొన్ని కీ సీన్స్ అయితే మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఇలాంటి సిట్యువేషన్ లో ఇరవై ఏళ్ల క్రితం తెలుగులో వచ్చిన ‘జయం’ రీమేక్ చేయటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎవరు చేస్తున్నారు..ఏమా కథ అంటే...

2002లో వచ్చిన ‘జయం’ సినిమా ఎంతటి పెద్ద హిట్టైందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నితిన్‌ హీరోగా పరిచయం చేస్తూ తేజా డైరక్ట్ చేసిన చిత్రం ఇది. లవ్,యాక్షన్ డ్రామాగా ఈ సినిమా అప్పటి కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. వెళ్లవయ్యా..వెళ్లు అంటూ హీరోయిన్ సదా చెప్పే మ్యానరిజం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే బాగా కలెక్ట్ చేసింది. కాగా ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాని కన్నడలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రీమేక్‌కు ‘కేజీఎఫ్‌’ యశ్‌ను తొలి రోజుల్లో హీరోగా పరిచయం చేసిన శశాంక్‌ డైరక్ట్ చేయనున్నారు. యశ్ కు దేశవ్యాప్త గుర్తింపు రావటంతో ఆయన్ని హీరోగా లాంచ్ చేసిన శశాంక్ ది లక్కీ హ్యాండ్ అని అక్కడ సినిమా జనం పడుతున్నారు. అలాగే హీరోగా కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్‌ ఆ తర్వాత జయం రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం.

అప్పట్లో ఈ సినిమా అదే టైటిల్ తో తమిళంలో కూడా రీమేక్‌ అయ్యింది. ఇందులో హీరోగా రవి నటించగా.. అక్కడ కూడా సదానే హీరోయిన్‌గా నటించింది. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో హీరో రవి పేరు కాస్తా ‘జయం’ రవిగా మారిపోయింది. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత ‘జయం’ కన్నడలో రీమేక్‌కు సన్నాహాలు చేయటం మాత్రం ఆశ్చర్యమే అంటున్నారు. ‘జయం’ లో చూపించిన పరిస్దితుల్లో ఇంకా కర్ణాటక గ్రామాలు ఉన్నాయేమో..అందుకే ధైర్యం చేస్తున్నారేమో అంటున్నారు.