Begin typing your search above and press return to search.

సోనూ సూద్‌ కు అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   2 Aug 2021 5:30 PM GMT
సోనూ సూద్‌ కు అరుదైన గౌరవం
X
ఏడాదిన్నర కాలంగా సోషల్‌ మీడియాతో పాటు ఏ మీడియా చూసినా కూడా సోనూ సూద్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం అవుతూ ఆయన్ను జనాల్లో రియల్‌ హీరోగా నిలబెట్టింది. స్టార్‌ హీరోలకు సైతం దక్కని అద్బుతమైన క్రేజ్ ను సోనూసూద్‌ దక్కించుకున్నాడు. రియల్‌ హీరో అంటూ కీర్తించబడుతున్న సోనూసూద్‌ ఎన్నో గౌరవాలను దక్కించుకున్నాడు. ఆయన్ను ఏకంగా ప్రధాన మంత్రి కావాలంటూ కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఆయన అభిమానులు గర్వించే మరో అద్బుతమైన గౌరవం దక్కింది.

వచ్చే ఏడాది రష్యాలో కజాన్ వేదికగా స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరుగబోతున్నాయి. ఈ స్పెషల్‌ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న భారత ఆటగాళ్ల జట్టులో సోనూసూద్‌ కూడా చేరారు. ఆయన్ను వచ్చే ఏడాది జరుగబోతున్న స్పెషల్‌ ఒలింపిక్స్ కు హాజరు కాబోతున్న అథ్లెట్లకు అంబాసిడర్ గా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపే విధంగా ఆయన ఈ పనిని దిగ్విజయం చేస్తాడనే నమ్మకంను వ్యక్తం చేశారు.

ఒలింపిక్స్‌ కు ఎంపిక అయిన జట్టులో తనను భాగస్వామ్యం చేసినందుకు గాను చాలా సంతోషంగా ఉందని.. ఇది నాకు ఖచ్చితంగా గౌరవం అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశాడు. ఈ రోజు చాలా స్పెషల్‌ డే అని.. ఈ రోజు భారత ఒలింపిక్స్ బృందంలో నాకు భాగస్వామ్యం దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరుగబోతున్న ఈ ప్రత్యేక ఒలింపిక్‌ గేమ్స్‌ కు సంబంధించినంత వరకు సోనూ సూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. తమ ఆహ్వానంను మన్నించి భారత బృందంలో చేరినందుకుగాను సోనూసూద్‌ కు కృతజ్ఞతలు అంటూ భారత ఒలింపిక్స్ జట్టు చైర్మన్ డాక్టర్ మల్లిక నడ్డా సంతోషం వ్యక్తం చేశారు.