ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన పాపులర్ సింగర్

Mon Sep 13 2021 21:00:02 GMT+0530 (IST)

A popular singer preparing for his third wedding

ప్రఖ్యాత పాప్ స్టార్ సినీ రచయిత డ్యాన్సర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమైంది. ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకొని భర్తకు గుడ్ బై చెప్పిన ఈ పాప్ సింగర్ మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతోంది.కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న ప్రియుడితో పెళ్లి నిశ్చితార్థం చేసుకొని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి. చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలో పాపులర్ అయ్యింది బ్రిట్నీ స్పియర్స్. ప్రపంచంలోనే సెన్షేషన్ క్రియేట్ చేసింది. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

23 ఏళ్ల వయసులోనే మొదటి వివాహం చేసుకుంది. 2004లో జాన్ అలెన్ అలెగ్జాండర్ తో జరిగిన వివాహం ఎంతో సేపు నిలవలేదు. కేవలం 55 గంటల వ్యవధిలోనే బ్రిట్నీ స్పియర్ తన భర్త జాసన్ కు గుడ్ బై చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించింది.

మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన కొద్ది నెలలకే 2004లో కెవిన్ ఫెడర్ లైన్ అనే ర్యాపర్ టెలివిజన్ నటుడిని పెళ్లి చేసుకుంది.అయితే మూడేళ్లు కాపురం చేశాక 2007 సంవత్సరంలో కెవిన్ బ్రిట్నీ స్పియర్స్ విడాకులు తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత ఫిట్ నెస్ ట్రైనర్ సామ్ అస్గారీతో బ్రిట్నీ స్పియర్ ప్రేమలో పడింది. 2016లో పరిచయం కాగా దాదాపు ఐదేళ్లుగా వారు డేటింగ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి ఎఫైర్ పై వార్తలు వచ్చినా వాటిని బ్రిట్నీ స్పియర్ లెక్కచేయలేదు. అయితే అనూహ్యంగా కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు షాక్ అయ్యారు.

నిశ్చిత్తార్థం నేపథ్యంలో బ్రిట్నీ స్పియర్ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేసింది. ప్రియుడు సామ్ బుగ్గలపై ముద్దు పెడుతూ నాకు నిశ్చిత్తార్థం జరిగిందనే విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నాను అంటూ వీడియోను షేర్ చేసింది. పింక్ కలర్ డ్రెస్ లో బ్రిట్నీ స్పియర్ కనిపించింది. వారిద్దరూ అతి సన్నిహితంగా ఫొటో కనిపించారు. అయితే నిశ్చితార్థం గురించి ఏమీ చెప్పకపోవడం గమనార్హం.