Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేములో మెగా 'బ్రో' సర్‌ప్రైజ్

By:  Tupaki Desk   |   28 May 2023 6:00 PM GMT
ఒకే ఫ్రేములో మెగా బ్రో సర్‌ప్రైజ్
X
ఈ మధ్యన తెలుగులో మల్టీస్టారర్ మూవీలు, రీమేక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటికి ప్రేక్షకులు మంచి ఆదరణను అందించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ లోని ఫిలిం మేకర్లు, హీరోలు మరింత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' అనే మూవీ చేస్తున్నారు.

తమిళంలో ఓటీటీ లో విడుదలై భారీ స్థాయిలో స్పందన ను సొంతం చేసుకున్న 'వినోదయ సీతమ్' చిత్రానికి రీమేక్‌ గా వస్తున్న 'బ్రో' మూవీ ని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు జరుగుతోన్న షెడ్యూల్‌లో సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్‌పై కీలకమైన సన్నివేశాల ను షూట్ చేస్తున్నారు.

మెగా మల్టీస్టారర్‌ గా రాబోతున్న 'బ్రో' మూవీ నుంచి ఇటీవలే టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆ వెంటనే పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ పాత్రల ను పరిచయం చేస్తూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశారు. వీటికి మెగా అభిమానుల తో పాటు సినీ ప్రియులు అందరి నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో ట్రీట్ వస్తుంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో' మూవీ నుంచి పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసున్న కంబైండ్ పోస్టర్‌ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీన్ని మే 29వ తేదీ సోమవారం ఉదయం 10:08 గంటల కు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక, ఇందులో పవన్, సాయి తేజ్ పోషిస్తున్న పాత్రలను కలిపి ఒకేసారి రివీల్ చేయబోతున్నారన్న మాట.

మెగా హీరోలు పవన్, సాయి తేజ్ కలిసి చేస్తున్న 'బ్రో' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే కు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.