Begin typing your search above and press return to search.

బలగం నేర్పిన పాఠం

By:  Tupaki Desk   |   20 March 2023 9:32 AM GMT
బలగం నేర్పిన పాఠం
X
దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి అప్పుడప్పుడు మంచి ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఎంత కమర్షియల్ సినిమాలు చేసిన కూడా మూలాలలోకి వెళ్లి కల్చర్ ని గుర్తు చేస్తూ, అలాగే కుటుంబ బంధాలు, హ్యూమన్ రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ ని అందుకుంటూ ఉంటారు. అలాంటి జోనర్ లోనే వచ్చిన చిన్న చిత్రం బలగం. దిల్ రాజు కూతురు తో కలిసి మరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి లో బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.

కమెడియన్ వేణు ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఇక తెలంగాణ పల్లె లో జరిగిన ఓ మామూలు కథగా దీనిని చూపించరు. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఉండే అమాయకత్వం, జీవన శైలిని బలగం లో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే చిన్న చిన్న ఎలిమెంట్స్ తనే ప్రేక్షకుల కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ని పండించారు. దీంతో మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో చేసిన ఈ మూవీ ఈ రోజు ఏకంగా 20 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే దిశగా దూసుకుపోతుంది.

ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండానే ఈ సినిమా కంటెంట్ తోనే ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించింది. మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ బలగం సినిమా చూసిన తర్వాత ఈ జెనరేషన్ యంగ్ దర్శకులు చాలా విషయాలు అర్ధం చేసుకోవాల నే మాట వినిపిస్తుంది. కమర్షియల్ మోజులో పడి ప్రేక్షకుడికి ఏం కావాలో అర్ధం చేసుకోకుండా సినిమాలు చేస్తూ డిజాస్టర్స్ కొడుతున్నారు. కొంతమంది అయితే ఏదో కొత్తగా చెప్పాల ని ప్రేక్షకులకి పూర్తిగా డిస కనెక్ట్ అయిపోతున్నారు.

ప్రేక్షకులకి ఒక సినిమా కనెక్ట్ అవ్వాలంటే అందులో ఎమోషనల్ గా టచ్ చేసే ఎలిమెంట్స్ ఉండాలని బలగం సినిమాతో మరోసారి రుజువు చేశారు. కథలు ఎంత కొత్తగా చెప్పిన, కమర్షియల్ గా ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చిన కంటెంట్ లో సోల్ లేకపోతే సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. అయితే బలగం సినిమా కొత్త కథ కాదు. కమర్షియల్ ఎలివేషన్స్ లేవు. కేవలం రూట్స్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తూనే, ఎమోషనల్ గా కనెక్ట్ చేసి వేణు సూపర్ హిట్ కొట్టాడు. ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత అయిన దర్శకులు తమ ఆలోచన మార్చుకుంటారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.