Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మాణం

By:  Tupaki Desk   |   19 Oct 2020 12:30 AM GMT
సూపర్‌ స్టార్‌ స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మాణం
X
సూపర్‌ స్టార్స్‌ నటులు అయిన వారు దర్శకత్వం విషయంలో ఎక్కువ ఆసక్తిని కనబర్చరు. ఎందుకంటే నటుడిగా బిజీగా ఉన్న సమయంలో దర్శకత్వం చేసి రిస్క్‌ తీసుకోవడం ఎందుకు అని అనుకుంటూ ఉంటారు కావచ్చు. అందుకే ఇప్పటి వరకు సూపర్‌ స్టార్‌ లుగా గుర్తింపు దక్కించుకున్న హీరోలు ఎవరు కూడా సినిమాలకు దర్శకత్వం వహించిన దాఖలాలు లేవు. కాని మొదటి సారి మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ దర్శకత్వం మరియు నిర్మాణంలో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

పిల్లల కోసం మోహన్‌ లాల్‌ ఒక త్రీడి మూవీ స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు గత ఏడాదే నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. 'బార్రోజ్‌' అనే టైటిల్‌ తో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ పిల్లల సినిమాను తెరకెక్కించబోతున్నారు. 3డి టెక్నాలజీతో రూపొందబోతున్న ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ టైటిల్‌ రోల్‌ లో కనిపించబోతున్నారు.

13 ఏళ్ల లిడియన్‌ అనే కుర్రాడు సంగీతాన్ని అందించబోతున్నాడు. హాలీవుడ్‌ స్టార్స్‌ మరియు టెక్నీషియన్స్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌. ఈ సినిమా టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. మోహన్‌ లాల్‌ గెటప్‌ చాలా విభిన్నంగా ఉండటంతో అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మలయాళంలో రూపొందే ఈ సినిమా అన్ని భాషల్లో కూడా డబ్బింగ్‌ చయబోతున్నారు.