Begin typing your search above and press return to search.

లావణ్య వరుణ్ ప్రేమ కు కారణమైన డైరెక్టర్ ఎవరంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2023 9:00 PM GMT
లావణ్య వరుణ్ ప్రేమ కు కారణమైన డైరెక్టర్ ఎవరంటే?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ లో ఉన్నారని.. త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నట్లు కథనాలు అయితే వెలువడ్డాయి. ఇందుకు కావాల్సిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం.

అయితే వీరి ప్రేమ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్స్ విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే.... వీరి ప్రేమ కు ఓ ప్రముఖ డైరెక్టర్ కారణమట. ఆయన ఎవరో కాదు... ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల. కామెడీ తో తన మార్క్ లెవెల్ సినిమాలు తెరకెక్కించే ఈయన.. ఈ జంట ప్రేమ కు కారణమయ్యారట. లావణ్య, వరుణ్‌ కాంబోలో 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్‌ వచ్చింది. ఈ సినిమా సమయంలోనే లావణ్య వరుణ తేజ్ ల మధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది.

ఈ రకంగా వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి శ్రీను వైట్లనే కారణం అంటూ సోషల్‌ మీడియా లో నెటిజన్లు ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు. ఇక శ్రీను వైట్ల కామెడీ చిత్రాలు... మీమర్స్ బాగే వాడేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఫన్సీ కోసం వీరి ప్రేమకు శ్రీను వైట్లనే కారణమంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. వీరి పెళ్లికి సినీ పెద్దల ను కూడా ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్.

ఇక వరుణ్ తేజ్ ముకుంద సినిమా తో టాలివుడ్ లోకి ఎంట్రి ఇవ్వగా.. లావణ్య త్రిపాఠితో కలిసి చేసిన సినిమాలు ఒకటి అంతరిక్షం కాగా మరొకటి మిస్టర్. సినిమా సినిమా కు తనదైన వైవిద్యం, మార్క్ తో దూసుకెళ్తున్నాడు వరుణ్ తేజ్. గతేడాది ఎఫ్3 తో వెంకటేష్ తో కలిసి హంగామా చేసిన వరుణ్ ప్రస్తుతం గాందీవధారి అర్జునుడు సినిమా లో నటిస్తున్నాడు.

ఈ సినిమా కు అర్జున్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. సాలిడ్ హిట్ పక్కా అంటున్నారు. చూడాలి మరి.