Begin typing your search above and press return to search.

'పెదరాయుడు' బుడ్డోడు హీరోగా..!

By:  Tupaki Desk   |   19 Oct 2021 6:42 AM GMT
పెదరాయుడు బుడ్డోడు హీరోగా..!
X
మోహన్ బాబు.. రజినీకాంత్ లు నటించిన పెద రాయుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. ఆ సినిమాలోని ప్రతి పాత్ర కూడా అద్బుతంగా దర్శకుడు మల్చాడు. సినిమాలో ఒక బుడ్డోడి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమా కథ ఆసక్తిగా సాగుతున్న సమయంలో కీలకంగా మారుతుంది. నేనున్నాను తాతయ్య అంటూ వచ్చే ఆ బుడ్డోడు ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తే. అలాంటి పాత్రతో ఆకట్టుకున్న మాస్టర్‌ మహేంద్రన్‌ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు మాస్టర్ కాస్త హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. హీరోగా తమిళంలో ఈయన నటించిన సినిమాను తెలుగు లో అర్థం అనే టైటిల్ తో డబ్‌ చేయబోతున్నారు. మహేంద్రకు ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. కనుక అర్థం సినిమాకు ఇక్కడ మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది.

అర్థం మోషన్ పోస్టర్ ను రిపబ్లిక్ దర్శకుడు దేవ కట్టా సోషల్‌ మీడియా ద్వారా రివీల్‌ చేయడం జరిగింది. సినిమా టీమ్ కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ టైటిల్ ను రివీల్‌ చేయడం జరిగింది. మహేంద్రన్‌ మరియు శ్రద్దా దాస్ లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు హర్ష వర్థన్ రామేశ్వర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో మహేంద్ర ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కేవలం సినిమా టైటిల్‌ ను మరియు ఒక విభిన్నమైన తలకిందులుగా ఉన్న పోస్టర్‌ ను మాత్రం రివీల్‌ చేయడం జరిగింది.

బాల నటులు హీరోలుగా పరిచయం అవ్వడం ఈ మద్య కాలంలో చాలా కామన్‌ గా జరుగుతున్న విషయం. పలువురు బాల నటులు హీరోలుగా మంచి పేరు దక్కించుకున్నారు. కనుక మహేంద్రన్‌ కూడా తప్పకుండా మంచి హీరోగా కూడా నిరూపించుకుంటాడు అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తెలుగు లో అర్థంతో ఎంట్రీ ఇవ్వబోతున్న మహేంద్రన్‌ కు ముందు ముందు డైరెక్ట్‌ తెలుగు సినిమాలు చేయాలనే కోరిక కూడా ఉందట. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసినా కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయంలో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. అది మహేంద్రన్‌ లో కూడా కనిపిస్తుందని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడించే అవకాశం ఉంది.