Begin typing your search above and press return to search.
వెండి తెరకి ఫేమస్ గాయకుడి బయోపిక్!
By: Tupaki Desk | 31 May 2023 8:00 PMపంజాబీ గాయకుడు అమర్ సింగ్ చమ్ కిలా గురించి చెప్పాల్సిన పనిలేదు. పంజాబ్ లో ఎంతో ఫేమస్ సింగర్ చమ్ కీలా. ఎన్నో పాటల తో సంగీత ప్రియుల్ని అలరించారు. ఆ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడు పోయిన రికార్డింగ్స్ లో అమర్ సింగ్ చేసిన పాటలే ఎక్కువ. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే అభిమానులెంతో మంది. ఎన్నో వైవిథ్య మైన పాటల తో శ్రోతల్ని అలరించారు. పిన్న వయసులోనే ఆయన మరణం అభిమానుల్ని ఎంతో కలచి వేసింది.
27 ఏళ్లకే నింగికెగిసిన ఓ గొప్ప కళాకారుడాయన. అయితే ఇప్పుడా యన జీవితం వెండి తెరకెక్కుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ 'చమ్ కీలా' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అమర్ సింగ్ పాత్రలో దిల్ జీత్ దోసంజా నటిస్తుండగా.. ఆయన భార్య అమర్ జోత్ కౌర్ పాత్రలో పరిణితి చోప్రా నటిస్తుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ యూనిట్ ఇవ్వలేదు. ఏకంగా ఓటీటీలోనే ఆ సినిమా టీజర్ ని నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అవ్వడంతోనే విషయం బయటకు వచ్చింది.
సినిమా లో తలపాగా లేకుండా దిల్ జీత్ కనిపించడం ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరుస్తుంది. సాధారణంగా పంజాబీ లు తలపాగా తప్పని సరిగా ధరిస్తారు. తరతరాలు వస్తోన్న ఆచారమది. దేవుడి ఆజ్ఞగా భావిస్తారు. సిక్కులు సంప్రదాయమది. అలాంటిది ఎలాంటి తలపాగా లేకుండా కేవలం ఆపాత్రని జుట్టుతో పరిచయం చేసారు. దీంతో సోషల్ మీడియాలో కాస్త నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాలో పాత్ర గురించి దిల్ జిత్ స్పందించారు.
'అమర్ సింగ్ పాత్ర పోషించడం నా జీవితంలో సవాల్ తో కూడిన అనుభవం. ఇలాంటి పాత్ర పోషించాలంటే పెట్టి పుట్టాలి. అంత గొప్ప వ్యక్తి జీవిత కథలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓటీటీలో ఓ కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తిగా ఉంది. నా మీద నమ్మకంతో దర్శకుడు ఈ అవకాశం కల్పించారు.
ఆయన నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రయత్నం చేస్తాను. నా పాత్ర ని ఒక కోణంలో చూడాల్సిన పనిలేదు. బుర్రలోంచి నెగిటివ్ ఆలోచనలు తీసి చూడండి' అని అన్నారు. ఇక సినిమా కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమర్ సింగ్ పాత్ర ని తెర పై చూడాలని ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.