స్టార్ హీరోలు సైడ్.. జూనియర్స్ కి ఓ గొప్ప అవకాశం

Tue Feb 07 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

A Great Opportunity For Juniors Heroes For This Summer

ప్రతి సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు రెండు మూడు అయినా విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. సమ్మర్ అనేది పెద్ద సినిమాలకు మంచి సీజన్. దాదాపుగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు అయ్యే సీజన్. కనుక చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను సమ్మర్ కు ప్లాన్ చేసుకోవడం మనం చూశాం. కానీ ఈసారి స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ బరిలో లేకపోవడం విశేషం.ఈ సమ్మర్ లో విడుదల కాబోతున్న సినిమాల్లో రావణాసుర.. ఏజెంట్.. దసరా.. దమ్కీ ఇంకా కొన్ని సినిమాలు పెద్దవిగా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని సినిమాలు కూడా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్నాయి కానీ సమ్మర్ కు అంటూ అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ సమ్మర్ లో మరిన్ని సినిమాలు వచ్చినా కూడా స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఏ ఒక్కటి వచ్చే పరిస్ధితి లేదు.

సమ్మర్ బరి నుండి స్టార్ హీరోలు సైడ్ అవ్వడంతో యంగ్ హీరోల సినిమాలకు గొప్ప అవకాశం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మొన్న సంక్రాంతికి చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఆ స్థాయి సినిమాలు ఈ సమ్మర్ లో విడుదల లేవు. సమ్మర్ తర్వాత దసరా సీజన్ మరియు ఆ తర్వాత మాత్రమే ఈ ఏడాదిలో స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవ్వబోతున్నాయి. మొత్తానికి సమ్మర్ లో మాత్రం రెండు మూడు నెలల పాటు స్టార్ హీరోల సినిమాల సందడి లేదనే చెప్పాలి. ఆ రెండు మూడు నెలలు మాత్రమే కాకుండా ఈ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కూడా స్టార్ హీరోల సినిమాలు లేవు.

మొత్తానికి రాబోయే నాలుగు అయిదు నెలల పాటు స్టార్ హీరోలు నటించిన.. నటిస్తున్న ఏ ఒక్క సినిమా కూడా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. చిరంజీవి భోళా శంకర్ సినిమా తో మళ్లీ స్టార్ హీరోల సినిమాల సందడి మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.