Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ : 5 రాష్ట్రాలు.. 133 లొకేషన్స్.. 600 రోజులు

By:  Tupaki Desk   |   17 May 2022 2:37 PM GMT
ఎన్టీఆర్‌ : 5 రాష్ట్రాలు.. 133 లొకేషన్స్.. 600 రోజులు
X
ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో హంగామా చేయడం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తే ఇతర హీరోల అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో అంతకు ముందు ఆ తర్వాత కూడా తమ సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్‌ అభిమానులు కొనసాగించడం అభినందనీయం. ప్రస్తుతం టీమ్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు అరుదైన రికార్డు దక్కింది.

టీమ్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 600 రోజులుగా అన్నదానం జరుగుతోంది. మొదట హైదరాబాద్‌.. తిరుపతి.. బెంగళూరులో మాత్రమే జరిగిన ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు ఏకంగా 5 రాష్ట్రాలకు విస్తరించింది. అయిదు రాష్ట్రాల్లో మొత్తం 133 లొకేషన్స్ లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ 600 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చుతూ సేవా గుణం ను చాటుకుంటూ తమ అభిమాన హీరో గర్వపడేలా చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటూ.. ఇతర హీరోల పట్ల.. ఇతర హీరోల అభిమానుల పట్ల విమర్శలు చేయడం కాకుండా ఒక ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి రోజు ఎంతో కొంత మందికి ఆకలి తీర్చుతున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ను అభినందించకుండా ఉండలేం అంటూ సోషల్‌ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ ఛారిటీ కార్యక్రమం ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. అభిమాన హీరో పేరు చెప్పి పాలాభిషేకాలు చేయడం.. లక్షలు ఖర్చు చేసి అలంకరించడం కాకుండా ఆకలితో ఉన్న వారికి కాస్త అన్నం పెట్టడం అనేది నిజంగా అభినందనీయం కార్యక్రమం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా లో కొమురం భీమ్ గా ఎన్టీఆర్‌ కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. జులై లేదా ఆగస్టు లో ఎన్టీఆర్‌ 30 సినిమా పట్టాలెక్కబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ 31 కి ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.