ప్లాప్ హీరో.. రెండేళ్ల పాటు ఆరు సినిమాలతో బిజీనట!!

Sat Jul 04 2020 20:28:14 GMT+0530 (IST)

6 Films Lined Up Can This Flop Get One Hit

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ నటిస్తున్న సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కొంతకాలంగా హిట్ల రేసులో కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. 2017లో వచ్చిన శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ మళ్లీ మంచి హిట్ అందుకోలేక పోయాడు. గతేడాది భారీ అంచనాలతో విడుదలైన రణరంగం ఇటీవల స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి జాను బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో శర్వా తన తదుపరి సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. 2020 2021 ఏడాదిలలో శర్వా పూర్తి ఫోకస్ తన సినిమాల మీదనే పెట్టబోతున్నాడట.వరుసగా ఆరు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో చక్కగా కథలు వింటూ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట. ఇప్పటికే శర్వా నుంచి 'శ్రీకారం' మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతుండగా.. ఇక అజయ్ భూపతితో చేయాల్సిన 'మహా సముద్రం' షూటింగులకు పర్మిషన్ ఇస్తే సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. ఖైదీ ఫేమ్ నిర్మాతల నిర్మాణంలో తెలుగు-తమిళ బైలింగ్వల్ ఫిల్మ్.. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా.. అయితే తాజాగా ఓ కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో మరో సినిమా తెరకెక్కునున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కథ ఫస్ట్ రామ్‌చరణ్ దగ్గరికి వెళ్తే.. చరణ్ శర్వాను రిఫర్ చేసాడని సమాచారం. మరి ఈ ఆరు ప్రాజెక్ట్ లలో శర్వాకి ఎన్ని హిట్లు వరిస్తాయో చూడాలి. ఇప్పటికే వరుస ప్లాప్ లలో ఉన్న శర్వాను ఏ డైరెక్టర్ గట్టెక్కిస్తాడా.. అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.