Begin typing your search above and press return to search.

5 కోట్ల నుంచి 500 కోట్ల బడ్జెట్ వరకు - ఇదీ ప్రభాస్ ప్రస్థానం

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:52 AM GMT
5 కోట్ల నుంచి 500 కోట్ల బడ్జెట్ వరకు - ఇదీ ప్రభాస్ ప్రస్థానం
X
5 కోట్ల బడ్జెట్ సినిమా నుండి 500 కోట్ల బడ్జెట్ సినిమా వరకు ప్రభాస్ ఎంతో ఎదిగాడు. తన తోటి హీరోలు, ఇండస్ట్రీలో తన స్నేహితులు హిట్లు లేక ఆపసోపాలు పడుతుంటే ప్రభాస్ హిట్ పై హిట్ కొడుతూ ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ కేవలం తెలుగు మాత్రమే కాదు. ఇండియాలోని చాలా భాషల ప్రేక్షకులు ప్రభాస్ ను ఓన్ చేసుకుంటున్నారు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో పాటు సాహో, రాధేశ్యామ్ సినిమాలతో దేశస్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆదిపురుష్ సినిమాతో వారి హృదయాలను గెలుచుకునేందుకు సిద్ధమయ్యాడు డార్లింగ్ ప్రభాస్.

ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్. మొట్టమొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ 2002 సంవత్సరంలో సరిగ్గా ఈరోజే విడుదల చేసింది చిత్ర బృందం. అలా తొలి సారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు డార్లింగ్. ఈశ్వర్ మూవీ 2002 జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జయంత్ పారాంజి దర్శకత్వం వహించారు. ఇందులో జూనియర్ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా హిట్లు వచ్చాయి. ఛత్రపతి, మున్నా, పౌర్ణమి, వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి, బాహుబలి ఒక్కో హిట్టూ కొడుతూ ఎదుగుతూ పోయాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు. 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈశ్వర్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం 500 కోట్ల బడ్జెట్ సినిమా చేసే రేంజ్ కు ఎదిగాడు.

ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయాణ ఇతిహాస చిత్రం ఇది. ఈ సినిమా గ్రాఫిక్స్ ను చక్కదిద్దే పనిలో ఉంది మూవీటీం. మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

వీటితో పాటు మారుతి డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్నాడు డార్లింగ్. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీవ్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.