ఐదుగురితో మాస్ రాజా సయ్యాట

Fri Jan 14 2022 20:28:03 GMT+0530 (India Standard Time)

5 Heroines And 10 Getups For Ravi Teja In Raavanasura

మాస్ మహారాజా రవితేజ స్పీడు మామూలుగా లేదుగా.. `క్రాక్`తో రాకెట్ స్పీడుతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో వరుసగా ఐదారు సినిమాలని లైన్ లో పెట్టేశారు. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు కూడా. శుక్రవారం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `రావణాసుర` లాంఛనంగా మొదలైంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇందులో పవర్ ఫుల్ లాయర్ గా రవితేజ కనిపించబోతున్నారు. ఆయన మేకోవర్ కూడా చాలా కొత్తగా వుండబోతోంది. అంతే కాకుండా టైటిల్ కి తగ్గట్టే ఇందులో రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నారు. భోగి సందర్భంగా ఈ చిత్రంలోని ఓ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. చాలా రఫ్ లుక్ లో మాసీవ్ గా కనిపిస్తూ లైటర్ తో సిగర్ కాలుస్తూ వున్నలుక్ ఇంట్రెస్టింగ్ గా వుంది.  

ఈ మూవీకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఐదుగురు క్రేజీ హీరోయిన్ లు నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ ఫరియా అబ్దుల్లా మేఘా ఆకాష్ పూజిత పొన్నాడ దక్ష నటిస్తున్నారు. ఈ ఐదురుగు హీరోయిన్ లలో నలుగురు సాఫ్ట్ క్యారెక్టర్ లు చేస్తుండగా లేడీ విలన్ గా దక్ష నాగర్ కర్ నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పవర్ ఫుల్ గా వుంటుందని చెబుతున్నారు.    

భోగి రోజు లాంఛనంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ఈ మూవీని గ్రాండ్ గా ప్రారంభించారు. సెప్టెంబర్ 30 న రిలీజ్ చేయనున్నారట. ఇదిలా వుంటే మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఖిలాడీ రామారావు ఆన్ డ్యూటీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో `రామారావు ఆన్ డ్యూటి` చిత్రానికి హీరో రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.