Begin typing your search above and press return to search.

#క్రైసిస్.. 2021లో బాలీవుడ్ కు 4000 కోట్ల నష్టం?

By:  Tupaki Desk   |   17 May 2021 3:30 PM GMT
#క్రైసిస్.. 2021లో బాలీవుడ్ కు 4000 కోట్ల నష్టం?
X
కొన‌సాగుతున్న సెకండ్ వేవ్ ప్ర‌భావంతో బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌లు తీవ్ర న‌ష్టాల్లో ఉన్నాయి. ఫిల్మ్ ఎగ్జిబిషన్ వ్యాపారం భవిష్యత్తుకి చీకటి అలుముకుంద‌ని.. కొనసాగుతున్న రెండవ వేవ్ రక్తపుటేరుల‌కు దారితీస్తుందని ఒక ప్ర‌ముఖ బాలీవుడ్ నిపుణుడు తాజా పరిస్థితిపై వివ‌ర‌ణ ఇచ్చారు.

భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు మంచి ఊపుమీద ఉండాల్సిన సంవ‌త్స‌ర‌మిది. కానీ ఈ సంవత్సరానికి థియేటర్లను మూసివేసిన‌ట్టేన‌ని.. మహమ్మారి యొక్క రెండవ వేవ్ కారణంగా సినిమాల‌కు వెళ్ళేవారు మ‌రింత జాగ్రత్తగా ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో చాలా అడ్డాలను ఎత్తివేసిన తరువాత కూడా స్టూడియోలు ఇప్ప‌ట్లో పెద్ద సినిమాలను విడుదల చేసే అవకాశం లేదు.

క్రైసిస్ వల్ల భారీ రిలీజ్ లు నిలిచిపోయాయి. చాలా మ‌ధ్యస్థ‌ బ‌డ్జెట్ చిత్రాలు ఆగిపోవ‌డం పెద్ద న‌ష్టానికి కార‌ణ‌మ‌వుతోంది. ఈ ఏడాది ఇప్ప‌టికే బాలీవుడ్ కు 4000 కోట్ల మేర‌ నష్టం వాటిల్లుతుందని ఓ ఇద్దరు ప్ర‌ముఖ వాణిజ్య నిపుణులు అంచ‌నా వెలువ‌రించారు.

2021 మార్చి త్రైమాసికంలో బాక్స్ ఆఫీసు ఆదాయం కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే కాగా.. ట్రేడ్ మ్యాగజైన్ కంప్లీట్ సినిమా ఎడిటర్ అతుల్ మోహన్ ప్రకారం... రెండవ త్రైమాసికం జూన్ మొద‌లు పూర్తి వాష్ అవుట్ లా ఉంద‌ని ... అన్నారు. 2020 మార్చి త్రైమాసికంలో మొత్తం బాక్స్ ఆఫీస్ వసూలు 1150 కోట్లుగా ఉందని మింట్ గతంలో నివేదించింది. ఇది మొదటి త్రైమాసికంలో అత్యధిక ఆదాయం.

2021 ఈ సీజ‌న్ దిగాలుగా సాగింది. సినిమా వ్యాపారంపై తక్కువ ఆశ ఉంది అని మోహన్ అన్నారు. మహమ్మారి మొదటి వేవ్ లో విధించిన ఆంక్షలు అంత ప్రమాదకరమైనవి కావు. 1500 కి పైగా తెరలు మూసివేయబడ్డాయి. రెండవ వేవ్ ఇది మరింత తీవ్రంగా మారింది. మరిన్ని థియేటర్లు మూత ప‌డ్డాయి.

చాలా మంది థియేటర్ యజమానులు వ్యాపారం నుండి నిష్క్రమించడానికి సిద్ధ‌మ‌య్యారు. వారంతా నిరాశగా ఉన్నారు, బాక్సాఫీస్ ఎప్పుడైనా కోలుకోవ‌డాన్ని చూడలేం అని మోహన్ పేర్కొన్నాడు. కనీసం మే-జూన్ వరకు థియేటర్లలో అనిశ్చితి ఉంటుంద‌ని విశ్లేషించారు.

గత అక్టోబర్ లో తిరిగి థియేట‌ర్ల‌ను తెరవడానికి అనుమతించిన తర్వాత నెలల తరబడి టాప్‌ హీరోల సినిమాలను విడుదల చేయడానికి చిత్రనిర్మాతలు ఇష్టపడనట్లే.. వారు ఈసారి కూడా నెమ్మదిగా అడుగులేసే అవకాశం ఉందని.. సీటింగ్ సామర్థ్యాలు రాష్ట్ర నిబంధనలతో గందరగోళం ఉంటుంద‌ని విశ్లేషించారు.అంతేకాకుండా గత సంవత్సరం పునరావృతంలో హాలీవుడ్ బాలీవుడ్ రెండింటి నుండి స‌రైన ప్ర‌యోజ‌నం పొంద‌లేక‌పోయాయి.

ముఖ్యంగా దక్షిణాది చలనచిత్ర వ్యాపారం 2021 ఆరంభం బావుంది. అనేక పెద్ద చిత్రాలను షెడ్యూల్ చేయడంతో సినిమా వ్యాపారం చాలా మంచి ఊపులో ఉందని మేము భావించాము. అయితే తాజా స్పైక్ (ఇన్ఫెక్షన్లలో) తో అక్క‌డా క్రైసిస్ త‌ప్ప‌లేదు. ఇటీవలే చలనచిత్ర పంపిణీలో ప్రవేశించిన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ యుఎఫ్.ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ లో ఇండియన్ ఆపరేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ మిశ్రా అన్నారు.

స‌ల్మాన్ న‌టించిన రాధే ఇటీవ‌ల థియేట్రిక‌ల్ ప్ల‌స్ ఓటీటీ లో రిలీజైంది. పేప‌ర్ వ్యూ విధానం లో వ‌చ్చిన చిత్ర‌మిది. కానీ రివ్యూలు స‌రిగా లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది. అయితే భారీ చిత్రం రిలీజ్ చేయ‌డంతో కొంత హుషారు పెరిగింది. బాలీవుడ్ లో సూర్యవంశీ వంటి భారీ చిత్రాలు థియేటర్లలో విడుదలకు వేచి ఉండ‌డం కొంత హోప్ పెంచుతోంద‌ని మిశ్రా అన్నారు. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లకు నేరుగా వెళ్ళిన చిత్రాలకు పేలవమైన స్పందన ఉంటుంది. పెద్ద స్క్రీన్ ఆకర్షణను చూపుతుంది. మే మధ్య నాటికి రెండవ వేవ్ శిఖరాన్ని తాకినా.. టీకా డ్రైవ్ ప్రారంభమైతే జూన్ నాటికి కొంత ప‌రిస్థితి అదుపులోకి రావొచ్క‌చు.. అని మిశ్రా చెప్పారు.