Begin typing your search above and press return to search.
'బాహుబలి' కోసం 400 కోట్లు అప్పు.. ఏదైనా తేడా కొట్టి ఉంటే?!
By: Tupaki Desk | 3 Jun 2023 8:00 AMఒక సినిమా నిర్మించడం అంటే నిర్మాతకు అది ఒక యజ్ఞం లాంటిది. ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి భారీగా వడ్డీలకు అప్పులు తెచ్చి సినిమాని నిర్మిస్తారు. తీరా సినిమా తీశాక అది హిట్టయి రిటర్నులు వస్తేనే ఇక్కడ మనుగడ సాధ్యం. ఒకవేళ తేడా కొడితే నడిబజారున పడాల్సి ఉంటుంది. అలా ఊహించని పెద్ద ఝలక్ లు తిని ఈ రంగంలో తీవ్ర నష్టాలతో దివాళా తీసిన నిర్మాతలు ఉన్నారు. చాలా పాపులర్ బ్యానర్లు ఇటీవల ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలీని స్థితి. ఈ రంగంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ఇక్కడ స్థిరపడాలంటే చాలా సాహసాలు చేయాల్సి ఉంటుంది.
అయితే బాహుబలి లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని నిర్మించడం కోసం ఆర్కా మీడియా సంస్థ ఎలాంటి రిస్కులు చేసిందో ఇప్పుడు భళ్లాల దేవ పాత్రధారి రానా దగ్గుబాటి వెల్లడించారు. ప్రభాస్- రానా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సంచలన విజయం సాధించి భారతీయ వినోద పరిశ్రమ తీరుతెన్నులనే మార్చివేసింది. దశాబ్ధాల సినీచరిత్రలో ఇది ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది.
అయితే ఈ భారీ చిత్రాన్ని నిర్మించే ప్రాసెస్ లో ఎలాంటి కష్టాలు ఎదురవ్వలేదా? అంటే.. నిజానికి నిర్మాతలు ఈ మూవీ చిత్రీకరణ సమయంలో విపరీతమైన ఆర్థిక ఒత్తిడికి లోనయ్యారని రానా తెలిపారు.
బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాలను తీయడానికి అప్పుగా తీసుకున్న డబ్బు గురించి రానా ఇన్నాళ్టికి బహిరంగంగా మాట్లాడారు. ఆ సమయంలో తెలుగు పరిశ్రమ స్టూడియో మోడల్ ను అనుసరించలేదు కాబట్టి సినిమాకు పెట్టుబడి పెట్టిన వందల కోట్లు బ్యాంకుల నుండి అధిక వడ్డీ రేట్లకు తీసుకు వచ్చారని తెలిపారు.
మూడు-నాలుగేళ్ల క్రితం సినిమాల్లోకి పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సినిమా నిర్మాతలు తమ ఇల్లు లేదా ఆస్తి బ్యాంకుకు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టి తెచ్చేవారని అన్నారు. ''దాదాపు 24-28 శాతం వరకు వడ్డీ చెల్లించాలి.
బాహుబలి లాంటి సినిమా కోసం ఆ వడ్డీ లెక్కలన్నీ కలుపుకుంటే రూ. 300-400 కోట్లు అప్పుగా తీసుకున్నారు'' అని వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగాన్ని విడుదల చేసినప్పుడు మేకర్స్ ఐదున్నరేళ్ల పాటు 24 శాతం వడ్డీకి రూ.180 కోట్లకు పైగా అప్పు తీసుకున్నారని రానా మీడియాకి తెలిపారు. పార్ట్ 1 తీయడం కష్టతరమైనది.
తెలుగులో అత్యధికంగా వసూలు చేసిన సినిమా కంటే రెండు రెట్లు అధికంగా ఖర్చు చేసారు. కాబట్టి ఎంత సంపాదించాం? ఎంత లాభం వచ్చింది? అనే గణాంకాలేవీ సమర్థనీయం కాదు. 180 కోట్ల అప్పును ఐదేళ్ల పాటు 24 శాతం వడ్డీకి తీసుకుని సినిమాని నిర్మించారంటే అర్థం చేసుకోవాలి. ఒకటిన్నర సంవత్సరాలు తొలి భాగం కోసం శ్రమిస్తే.. అదే సమయంలో మేం బాహుబలి 2ని కూడా కొంచెం చిత్రీకరించాం కాబట్టి తొలి భాగం సరిగా ఆడకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఊహించలేం'' అని అన్నారు.