ఈ వారం ఒటీటీలో ఏకంగా 28 చిత్రాల హవా

Tue Mar 21 2023 07:00:02 GMT+0530 (India Standard Time)

28 films release in OTT this week

థియేటర్ తో పాటు ప్రస్తుతం ఒటీటీ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకుల అందుతుంది. ఒటీటీలో వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు కూడా ప్రతి వారం రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు అన్ని కూడా ఏభై రోజుల్లో ఒటీటీలోకి రిలీజ్ అయిపోతున్నాయి. ఇక వాటికి డిజిటల్ స్ట్రీమింగ్ చానల్స్ లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్స్ ద్వారా కంటే నెట్ ఫ్లిక్స్ ద్వారానే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.ఇదిలా ఉంటే ఈ వారం కూడా అదే స్థాయిలో ఒటీటీ స్ట్రీమింగ్ చానల్స్ ద్వారా ఏకంగా 28 సినిమాల వరకు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి. ఇండియన్ లాంగ్వేజ్ లతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ మూవీస్ వస్తూ ఉండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెబ్ సిరీస్  హంటర్ మార్చి 22న స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో పాటు పఠాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా మార్చి 22న స్ట్రీమింగ్ అవుతుంది.

నెట్ ఫ్లిక్స్ లో  ఇంగ్లీష్ మూవీ వుయ్ లాస్ట్ అవర్ హ్యుమన్ మార్చి 21 వాకో: అమెరికన్ అపకాలిప్స్ మార్చి 22 ద నైట్ ఏజెంట్ మార్చి 23 హిందీ సినిమా చోర్ నికల్ కే భాగా మార్చి 24 హాలీవుడ్ మూవీ క్రైసిస్ మార్చి 26 స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక హాట్ స్టార్ లో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సక్సెసెన్ సీజన్ 4 మార్చి 26న ప్రసారం కాబోతుంది. ఇక ఆహాలో కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ మార్చి 22 డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ మార్చి 24న టెలికాస్ట్ కాబోతుంది.

ఇక జీ5లో కంజూస్ మకీచోస్ అనే హిందీ మూవీ  మార్చి 24 మలయాళీ మూవీ పూవన్ మార్చి 24 తమిళ్ వెబ్ సిరీస్ సెంగలమ్ మార్చి 24న స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈటీవీలో విన్ లో పంచతంత్రం మార్చి 22న స్ట్రీమింగ్ కాబోతుంది. వీటితో పాటు ఇతర భాషలకి సంబందించిన మూవీస్ కూడా డిఫెరెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో టెలికాస్ట్ కాబోతూ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.