Begin typing your search above and press return to search.

‘దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే’ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది..

By:  Tupaki Desk   |   20 Oct 2020 4:30 AM GMT
‘దిల్​వాలే దుల్హనియా లేజాయేంగే’ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది..
X
‘దిల్​వాలే దుల్హనియా లేజేయాంగే’ ఈ సినిమా గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతీశయోక్తి కాదేమో..! 1995 లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను చెరిపేయడమే కాదు. ఓ కొత్త ట్రెండ్​ను సృష్టించింది. ప్రేమకథా చిత్రాలకు ప్రాణం పోసింది. ప్రేమకు ఓ పవిత్రతను తీసుకొచ్చింది. అంతవరకు ప్రేమించడం నేరం, ఘోరం అనుకున్నవారు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ప్రేమలో కష్టాలు మాత్రమే కాదు.. ఎంత పవిత్రత ఉంటుందో ఎంత గొప్పదనం ఉంటుందో ప్రపంచానికి చాటింది ఈ చిత్రం. ఈ సినిమా ఒక్క భారతీయ సినీప్రియులనే కాదు.. యావత్​ ప్రపంచాన్ని ఆకర్షించింది. పాత రికార్డులన్నీ చెరిపేసింది. కొత్త ట్రెండ్​ తీసుకొచ్చింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఈ సినిమా 15 సంవత్సరాలపాటు ఆడింది.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఒక సినిమా ఇన్నేళ్లపాటు థియేటర్ లో కంటిన్యూగా ఆడటం ఇదే మొదటిసారి. ఆఖరి సారి కూడా. అంత గొప్ప చిత్రానికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్​ 20 తో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా లండన్​లోని సీన్స్​ ఇన్​ స్క్వేర్​లో ఈచిత్రంలో నటించిన కాజల్​, షారూఖ్​కాన్​ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హార్ట్​ ఆఫ్​ లండన్​ బిజినెస్​ అలయన్స్​ ఓప్రకటన చేసింది. అయితే వచ్చే ఏడాది విగ్రహాలను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఓ భారతీయ సినిమా స్థాయి ప్రపంచస్థాయికి వెళ్లిపోయింది.