Begin typing your search above and press return to search.

2018 బాక్సాఫీస్.. రెండవ రోజు మరింత స్ట్రాంగ్

By:  Tupaki Desk   |   28 May 2023 1:16 PM GMT
2018 బాక్సాఫీస్.. రెండవ రోజు మరింత స్ట్రాంగ్
X
గతంలో కంటే ఇప్పుడు సౌతిండియా లోని ఇండస్ట్రీల్లో నేచురల్ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం మలయాళ పరిశ్రమలోనే రూపొందుతోన్నాయి. ఈ క్రమంలోనే అదే ఇండస్ట్రీ నుంచి తాజాగా వచ్చిన చిత్రమే '2018'. టివినో థామస్ హీరోగా చేసిన ఈ సినిమాను 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంతో జూడే ఆంథనీ జోసెఫ్ తీశాడు.

పెద్దగా అంచనాలు లేకుండానే మలయాళంలో విడుదలైన '2018' మూవీకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో మొదటి రోజు తప్ప మిగిలిన అన్ని రోజులూ దీనికి అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఇప్పటికే అక్కడ రూ. 155 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో మలయాళంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందిన '2018' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగు లోకి డబ్బింగ్ చేసింది. దీంతో మే 26వ తేదీన ఇక్కడ ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఇక, ఈ మూవీకి తెలుగులోనూ మంచి టాక్ రావడంతో మొదటి రోజు రూ. 1.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, రెండో రోజు భారీగా పుంజుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 1.71 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

'2018' తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో నూ అదిరిపోయే స్పందనను అందుకుంటోంది. ఫలితంగా రెండు రోజుల్లోనే ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.15 కోట్లు గ్రాస్, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 1.60 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసింది. ఫలితంగా 2 రోజులకూ కలుపుకుని రూ. 2.73 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.28 కోట్లు షేర్‌ ను వసూలు చేసుకుంది.

'2018' సినిమా కు సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రూ. 1.80 కోట్లు వరకూ జరిగింది. అంటే.. ఇది రూ. 2 కోట్లు షేర్‌ను వసూలు చేస్తేనే క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 2 రోజుల్లోనే '2018' మూవీ రూ. 1.28 కోట్లు రాబట్టింది. తద్వారా విజయానికి ఇంకా రూ. 72 లక్షల దూరంలో ఉంది. ఈ వీకెండ్‌లోనే ఇది చేరు అవకాశం కనిపిస్తోంది.