Begin typing your search above and press return to search.

ఒక్క పొరపాటు.. కోట్లు పోగొట్టుకున్న '2018'

By:  Tupaki Desk   |   30 May 2023 8:00 PM GMT
ఒక్క పొరపాటు.. కోట్లు పోగొట్టుకున్న 2018
X
మలయాళ ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టిస్తూ అక్కడ నెంబర్ వన్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించిన సినిమా '2018'. కేరళలో వరదల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం కేవలం రూ. 15 కోట్లు బడ్జెట్‌తోనే వచ్చి.. ఏకంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 80 కోట్లకు పైగా షేర్‌తో మలయాళ ఇండస్ట్రీలోనే టాప్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసుకుంది.

మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన '2018' మూవీ మే 26వ తేదీన తెలుగులో కూడా విడుదలైంది. గీతా ఆర్ట్స్ సంస్థ దీన్ని భారీగా విడుదల చేసింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి స్పందనను అందుకుంటూ అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 5 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టి క్లీన్ హిట్ స్టేటస్‌ను సైతం చేరుకుంది.

ఒకవైపు మలయాళంలో నాలుగో వారంలోనూ చక్కగా రాణిస్తూ.. మరోవైపు తెలుగులో డీసెంట్ కలెక్షన్లతో లాభాల దిశగా సాగిపోతోన్న '2018' మూవీని ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ.. దీన్ని జూన్ 7వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

'2018' మూవీ మలయాళం వెర్షన్‌ను మాత్రమే జూన్ 7వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్‌కు మరికొంత సమయం ఉందని తెలిసింది.

అయితే, ఇప్పటికీ మలయాళంలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఇది రూ. 200 కోట్లు మార్కును చేరుతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది స్ట్రీమింగ్‌కు రావడం పెద్ద మైనస్ అని చెప్పాలి.

అలాగే, తెలుగులో సైతం ఇది విడుదలై ఎన్నో రోజులు కావడం లేదు. కాబట్టి మరో వారం రోజుల వరకూ థియేటర్లలో ఆడే మౌత్ టాక్‌ను ఇది సొంతం చేసుకుంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీలోకి వస్తే ఇక్కడ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తానికి చక్కగా ఆడే సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకు రావడం వల్ల.. '2018' కొన్ని కోట్లనే కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.