Begin typing your search above and press return to search.
200 కోట్ల మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ బయోపిక్?
By: Tupaki Desk | 18 March 2023 9:08 AMరాముడు మంచి బాలుడు! అనే థీమ్ ఎంచుకుని ఆద్యంతం వినోదానికి కొదవ లేదనిపించేలా సినిమా తీసినా జనం చూస్తున్నారు. అండర్ వరల్డ్ కింగ్ లు.. మాఫియా డాన్ ల కథలతో సినిమాలు తీసినా ప్రజలు థియేటర్లకు వెళ్లి మరీ చూస్తున్నారు. ప్రజల్లో స్ఫూర్తిని నింపే దేశభక్తి సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. స్పై ఆపరేషన్ గూఢచారుల కథలతో సినిమాలు పాన్ ఇండియా హిట్లు కొడుతున్నాయి. గుడులు గోపురాల రహస్యాల నేపథ్యంలో కార్తికేయ లాంటి థ్రిల్లర్ సినిమాలకు గొప్ప ఆదరణ దక్కుతోంది. క్రీడాకారులు - రాజకీయ నాయకుల బయోపిక్కులకు గొప్ప ఆదరణ ఉంది. అలాగే సంఘంలో మోసగాళ్ల జీవితకథలతో సినిమాలు తీస్తే అందులో ఉండే మెలోడ్రామా ఇంటెలెక్టువల్ గేమ్ ని ప్రజలు విపరీతంగా అభిమానిస్తారు. కేజీఎఫ్ రాఖీభాయ్ పై ఉన్నంత క్యూరియాసిటీ మోసగాళ్ల విషయంలోను ప్రజలకు ఎల్లపుడూ ఉంటుంది.
ఇటీవల 200 కోట్ల మనీ లాండరింగ్ స్కామ్ లో ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకి వచ్చిన కాన్ మాన్ సుకేష్ చంద్రశేఖర్ యూట్యూబ్- వార్తా చానెళ్ల స్టోరీలకు అద్భుతమైన జనాదరణ దక్కింది. గూగుల్ లో ట్రెండింగ్ అయిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అతడి జీవిత కథ అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ కథానాయికలతో స్నేహాలు ప్రేమాయణాలు సహా పెద్దమనుషులు రాజకీయ నాయకులను ట్రాప్ లో వేసి సుమారు 200 కోట్ల మేర మోసం చేసిన ఘటనలో అతడు ఆడిన బ్లేమ్ గేమ్ ప్రధానంగా ప్రజల్లో చర్చనీయాంశమైంది. సుకేష్ కథలో ట్విస్టులు ఆకర్షించడంతో పలువురు ఫిలింమేకర్స్ అతడి పై సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు.
తాజా సమాచారం మేరకు మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ జీవిత కథను పెద్ద తెరపై సినిమాగా తీసేందుకు సన్నాహకాలు మొదలయ్యాయి. ప్రముఖ ఫిలింమేకర్ ఆనంద్ కుమార్ ఇప్పటికే అతడి బయోపిక్ గురించి సీరియస్ గా పని చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. సుకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇటీవల ఇదే తీహార్ జైలు ఏఎస్పీ జైలర్ దీపక్ శర్మ మాట్లాడుతూ- సుఖేష్ చంద్రశేఖర్ జీవిత కథపై భారీ ఆసక్తి నెలకొందని.. నిర్మాత ఆనంద్ కుమార్ సినిమా తీయాలని యోచిస్తున్నారని చెప్పడం ఆసక్తిని కలిగించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - నోరా ఫతేహిలతో సంబంధాలు సహా కాన్ మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ బిగ్ షాట్స్ ని మోసం చేసిన మేధావిగా..
మనీలాండరింగ్ బ్లేమ్ గేమ్ లో సంచలన హీరోగా అతడిని ప్రజలు చూస్తున్నారు. అందుకే అతడు పెద్దమనుషులతో ఎలాంటి ఆట ఆడాడు? అన్నది తెలుసుకోవాలనే తహతహ అందరిలోను ఉంది. అది సినిమా తెరపై గొప్ప వినోదాన్ని అందిస్తుందని ఆనంద్ కుమార్ భావిస్తున్నారు. ఆ మోసగాడి గురించి మరింత తెలుసుకోవాలని భావించిన ఆనంద్ ఇప్పటికే ఏఎస్పీ జైలర్ దీపక్ నుంచి వివరాలు రాబట్టారని సమాచారం. ఆనంద్ తో ఉన్న ఫోటోను దీపక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా రకరకాల ఊహాగానాలు బయటపడ్డాయి. ఇది సుకేష్ జీవితంపై ఫిలింమేకర్ ఆనంద్ భారీ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నారనే పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.
సుకేష్ జీవితానికి సంబంధించిన అన్ని కీలకమైన వివరాలను సేకరిస్తున్నారని .. సుకేష్ చంద్రశేఖర్ బయోపిక్ స్క్రిప్ట్ పై పని చేయడానికి తన రచయితల బృందాన్ని బరిలోకి దించారని 6 నెలల పాటు వీరి కోసం రాజధానిలో ఒక ఖరీదైన హోటల్ ను కూడా బుక్ చేసుకున్నాడని సోర్సెస్ చెబుతున్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక- లొకేషన్ల వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
2024 చివర్లో లేదా 2025 ప్రారంభంలో కాన్ మాన్ బయోపిక్ ని థియేటర్లలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్ బయోపిక్ లు తీస్తే ప్రజల్లో ఎంత క్యూరియాసిటీ ఉంటుందో తెలియదు కానీ.. సుకేష్ చంద్రశేఖర్ బయోపిక్ పై ప్రజల్లో అంతకుమించిన క్యూరియాసిటీ ఉంటుందని ఫిలింమేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సిల్క్ స్మిత డర్టీ పిక్చర్ ని మించిన ఘనవిజయం సాధించే కాన్సెప్ట్ ఇదని మేకర్స్ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.