చిట్టిరోబో చెన్నైలో జోరుమీద ఉన్నాడే..!

Mon Dec 10 2018 18:00:01 GMT+0530 (IST)

2.O Movie Eye On Huge Collections Record In Chennai

రజనీ కాంత్ తాజా చిత్రం '2.0' నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  చెన్నై సిటీలో ఈ సినిమా ఒక భారీ రికార్డు సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. చెన్నై సిటీలో అల్ టైమ్ నెంబర్ 1 మూవీ కలెక్షన్స్ రికార్డ్ 'బాహుబలి-2' పేరిట ఉంది.  'బాహుబలి 2' ఫుల్ రన్ లో చెన్నైలో దాదాపు రూ.19 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ రికార్డును ఏ సినిమా కూడా సవరించలేకపోయింది.   నిన్న ఆదివారం తో '2.0 ' రూ.18.41 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. సోమవారం నాడు #బాహుబలి 2 ను క్రాస్ చేసి ఆల్ టైం నం. 1 మూవీగా రికార్డు సృష్టించనుందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.  అంటే పన్నెండో రోజున చిట్టిరోబో 'బాహుబలి 2' చెన్నై రికార్డుకు ఎసరు పెడుతున్నాడన్నమాట.  ఇది నిజంగానే రజనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే కదా.   

ఇదిలా ఉంటే '2.0' హిందీ వెర్షన్ తాజాగా రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును దాటి ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఫుల్ రన్ కలెక్షన్లను క్రాస్ చేసింది.  హిందీ వెర్షన్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును దాటి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.