Begin typing your search above and press return to search.

#SVC40 పింక్ రీమేక్.. ప‌వన్ తోనేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:26 PM GMT
#SVC40 పింక్ రీమేక్.. ప‌వన్ తోనేనా?
X
గ‌త కొంత‌కాలంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ రీమేక్ లో ఆయ‌న న‌టించ‌నున్నారని... బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ తో క‌లిసి శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వం నేడో రేపో అంటూ లీకులు అందాయి. ఇప్పుడు అది నిజ‌మైంది.

ఎట్ట‌కేల‌కు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ నుంచి అధికారిక సమాచారం అందింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ 40వ (#SVC40) చిత్రంగా పింక్ రీమేక్ తెర‌కెక్క‌నుంది. మ్యూజిక్ సెష‌న్స్ ప్రారంభం అయ్యాయి. థ‌మ‌న్ సార‌థ్యంలో టెర్రిఫిక్ ట్యూన్ రెడీ అయ్యింది. మాంచి పాజిటివ్ నోట్ తో మొద‌లు పెట్టాం.. అంటూ దిల్ రాజు బృందం ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు. వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని ఈ ట్వీట్ లో వెల్ల‌డించారు.

అయితే ఈ ట్వీట్ లో ఎక్క‌డా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్నారు అన్న విష‌యాన్ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం సందేహానికి తావిస్తోంది. ఇంత‌కీ ప‌వ‌న్ ఈ చిత్రానికి అంగీక‌రించారా లేదా? ఆయ‌న రీఎంట్రీ చిత్రం ఇదేనా కాదా? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్. ఎస్.వీ.సీ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించాకే దానిని ధృవీక‌రించాల్సి ఉంటుంది. బాగా ప‌రిశీలిస్తే ఈ ట్వీట్ లో బోనీక‌పూర్ తో క‌లిసి నిర్మిస్తున్న‌ట్టుగా ఎక్క‌డా లేక‌పోవ‌డం మ‌రిన్ని సందేహాల‌కు తావిస్తోంది. థ‌మన్ తో క‌లిసి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వేణు శ్రీ‌రామ్ - దిల్ రాజు మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్న ఫోటోని రివీల్ చేశారు.