Begin typing your search above and press return to search.

#RRR.. సంక్రాంతి అప్ డేట్ ఇదే?

By:  Tupaki Desk   |   16 Jan 2020 7:25 AM GMT
#RRR.. సంక్రాంతి అప్ డేట్ ఇదే?
X
సంక్రాంతి పండుగొచ్చింది. దేశ విదేశాలు, నగరాలు, పట్టణాల్లోని వారంతా పండక్కి సొంతూళ్లకు వచ్చారు. ఈ పండుగ పూట అందరూ జోష్ తో ఉంటారు. అందుకే సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక స్టార్ హీరోల కొత్త సినిమాల అప్ డేట్లు కూడా వస్తుంటాయి.

అయితే బాహుబలి తర్వాత జక్కన్న తీస్తున్న #RRR మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఒక్క మోషన్ పోస్టర్ తప్పితే ఆ సినిమా నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. సంక్రాంతి పండుగ పూట ఏదో ఒక అప్ డేట్ ఇస్తారని అభిమానులు కళ్లు కాయలు కాసి పండ్లు పండే వరకూ ఎదురుచూశారు. ప్చ్.. కానీ రాలేదు. శరామామూలుగానే సంక్రాంతి థీమ్ తో ఓ సాదీసీదా సినిమా అప్ డేట్ లేని శుభాకాంక్షల పోస్టర్ ను రిలీజ్ చేసి ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళి ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆప్ డేట్ కోసం సంక్రాంతికి ఎదురుచూసిన ఓ ఎన్టీఆర్ వీరాభిమాని అది రాకపోయేసరికి డైరెక్టుగా ట్విట్టర్ లోనే ఆర్ఆర్ఆర్ యూనిట్ ను ట్యాగ్ చేసి అడిగేశారు. ఓ సరదా ఎన్టీఆర్ మీమ్ ను యాడ్ చేసి ట్రోల్ చేశాడు. ఈ సరదా ట్వీట్ కు ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఎన్టీఆర్ నవ్వే జిఫ్ ను అందుకు రిప్లై చేసి ఆర్ఆర్ఆర్ అప్ డేట్ దాటవేసింది. ఈ సరదా సంవాదం ఆసక్తి రేపింది. ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ఈ సంక్రాంతికి రాదని దీని ద్వారా రాజమౌళి-ఆర్ఆర్ఆర్ టీం జవాబు ఇచ్చినట్టు అర్థమైంది.