బాహుబలి రికార్డ్స్ కొట్టాలంటే ఆ సినిమా రావాల్సిందేనా...?

Wed Oct 09 2019 23:00:01 GMT+0530 (IST)

#RRR Ready to Baahubali Records

బాహుబలి రిలీజ్ అయ్యాక ఆ తర్వాత వచ్చే తెలుగు సినిమా కలెక్షన్స్ అన్నింటికీ నాన్ బాహుబలి రికార్డ్స్ అని కొత్త పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు ఇండస్ట్రీ వాళ్ళు. దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు బాహుబలి రెండు చిత్రాలు ఎంతలా తెలుగు ఇండస్ట్రీ మీద ఎంత ప్రభావం చుపించాయో. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ సృషించాయి తప్ప బాహుబలి 2 సినిమా దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు.ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాలలో కొన్ని బాహుబలి 2 ని క్రాస్ చేస్తాయని కొందరు అనుకున్నారు. అందులో 'సాహో - సైరా' మూవీ లపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. కానీ 'సాహో' మూవీ బాహుబలికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. 'సైరా' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా చూస్తే ఆ సినిమా కూడా బాహుబలి 2 దగ్గర్లోకి కూడా రాలేదని అర్ధమైపోతుంది.

ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు గొట్టాలంటే రాజమౌళి వల్లే అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. రాజమౌళి తీస్తున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తుంది. రాజమౌళి కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చూసే ప్రేక్షకులు తెలుగుతో అన్ని భాషల్లోనూ ఉన్నారు. దీంతో బాహుబలి రికార్డ్స్ బద్దలుకొట్టాలంటే రాజమౌళికి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.