హాలీవుడ్ సినిమా సెట్ లో గాడ్ ఫాదర్ బ్యూటీ మెరుపులు!

Fri Oct 07 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

?Bigg Boss Divi on the sets of a Hollywood film

దివి వద్యత గురించి పరిచయం అవసరం లేదు. `బిగ్ బాస్` సీజన్ 4లో వేడెక్కించే పెర్పార్మెన్స్ తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లింది.  తనదైన అందం కవ్వింతతో  యువతరానికి తెగ నచ్చేసింది. అమ్మడి అందచందాల ప్రతిభకు దర్శకనిర్మాతలు ఫిదా అవుతున్నారు.  ఆక్రేజ్ తోనే వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు అందుకుంటుంది. అటు  కమర్శియల్   యాడ్స్ లోనూ బిజీ అవుతోంది.ప్రస్తుతం ఈ బ్యూటీ కొద్ది రోజులుగా ఇటలీ అందాల్లో మమేకమైంది. అమ్మడి సోలో ట్రిప్‌లో ఇది. దీంతో బ్యూటీ ఇటలీ మొత్తాన్ని స్వేచ్ఛగా  చుట్టేస్తుంది. ఇప్పటికే అక్కడి అందాల్ని కవర్ చేస్తూ కొన్ని ఫో టోల్ని షేర్ చేసింది.  తాజాగా హాలీవుడ్ చిత్రం `ఈక్విలైజర్ 3` సెట్స్‌లో ప్రత్యక్షమైంది. రోమ్‌లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో చిత్ర ప్రధాన నటుడు డెంజెల్ వాషింగ్టన్.. దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా మరియు సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్‌సన్‌లను కలిసింది.

ఆ ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్  చేసి  ఆనందాన్ని వ్యక్తం చేసింది.  “రోమ్‌లో ఈక్వలైజర్ 3 సెట్స్‌లో అద్భుతమైన సమయం గడిపాను. ధన్యవాదాలు బాబ్.  ఇలాంటి అవకాశం కల్పించడం అద్భుతమైన అనుభవానికి గురిచేస్తుంది.   గ్రేట్  సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్‌సన్… మీరు లేకుండా ఇది జరిగేది కాదు.  మూడు  సంవత్సరాల క్రితం నేను యాడ్ ఫిల్మ్ కోసం ఇండియాలో అతని దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాను.

డెంజెల్ వాషింగ్టన్ అద్భుతమైన వ్యక్తి. అతను చాలా వినయపూర్వకంగా ఉంటారు. అతనితో సంభాషణను ఎంతో ఇష్టపడతాను.  అతని ప్రసంగాలను తరుచు చూస్తాను.  వీడియోలను అనుసరిస్తాను. అతని ప్రభావం నాపై బలంగా ఉంటుంది. అతనిలో పాజిటివ్ యాటిట్యూడ్ ఎంతో నచ్చుతుంది. అంటోని పూక్వా  ఈక్వలైజర్ సిరీస్.. ట్రైనింగ్ డే లాంటి అనేక గొప్ప చిత్రాలు తెరకెక్కించారు.

సన్నివేశం పట్ల అతనికి ఉన్న స్పష్టత .. ఆన్  సెట్స్‌లో అతను పనితనం ఎంతో నచ్చుతుంది.  వారు పనితనం చూసి వారి పట్ల నా గౌరవం 10 రెట్లు పెరిగింది. నా రోమ్  పర్యటన ఎంతో విలువైనది. ఈ ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోతుంది. దివ్య  వద్యత  మెగాస్టార్ చిరంజీవి నటించిన  `గాడ్ ఫాదర్` లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.