ఇండియా టు ఇటలీ... శాకాహారులు ఎక్కువగా ఉన్న దేశాలివే!
అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చలా మంది ఇప్పుడు శాకాహారాన్ని అవలంభిస్తున్నారని అంటుంటారు.
By: Tupaki Desk | 21 Aug 2024 10:30 PM GMTకొంతమంది చిన్నప్పటి నుంచీ మాంసాహారులు అయినప్పటికీ.. కారణాలు ఏమైనా కాలక్రమంలో శాకాహారులుగా మారిపోతున్నారు. ఇంకొంత మంది పుట్టినప్పటి నుంచీ శాకాహారులుగా ఉన్నా తదనంతర కాలంలో మాంసాహారులవుతున్నారని అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ.. ఎవరు ఎలా మారినప్పటికీ.. శాకాహారం తినడమా, మాంసాహారం తినడమా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపికనే చెప్పాలి.
అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చలా మంది ఇప్పుడు శాకాహారాన్ని అవలంభిస్తున్నారని అంటుంటారు. లైఫ్ స్టైల్ ఛెంజ్ లో భాగంగా ఆహారపు అలవాట్లనూ మారుస్తున్నారు. కొంతమంది హెల్త్ కాన్సియష్ కాస్త ఎక్కువగా ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారని చెబుతుంటారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య పెరుగుతుందని అంటుంటారు.
ఈ నేపథ్యంలో ప్రపంచం వ్యాప్తంగా శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్ - 5 దేశాలను ఒకసారి పరిశిలిద్దాం...!
భారతదేశం: అత్యధిక సంఖ్యలో శాకాహారం తినేవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో ఉంది భారత్. ఇక్కడ ఉన్న జనాభాలో సుమారు 30శాతం మందికి పైగా ప్రజలు శాకాహారమే తింటారని చెబుతున్నారు. ఈ శాతంలో ప్రధాన వాటా హర్యానా, రాజస్థాన్ లలో నివసిస్తున్న ప్రజలని అంటుంటారు!
ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ జనాభాలో సుమారు 13 శాతం మంది ప్రజలు శాకాహారులే. మనిషి తన ఆకలిని తీర్చుకోవడానికి జంతువులను చంపడాన్ని సమర్ధించలేమని ఇక్కడ నివసించే కొంతమంది ప్రజానికం బలంగా నమ్ముతారంట.
తైవాన్: శాఖాహర ఆహారాన్ని భుజించే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడున్న మొత్తం జనాభాలో 12 శాతం మంది ఇక్కడ శాకాహారాన్నే అనుసరిస్తున్నారు. ఇక్కడ వెజ్ రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి.
ఇటలీ: ఇటలీ జనాభాలో సుమారు 10 శాతం మంది ప్రజలు వెజిటేరియన్స్. వాస్తవానికి ఇటలీ నాన్ వెజ్ వంటకాలకు ఎక్కువ ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఇక్కడ శాకాహారుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఆస్ట్రియా: ప్రపంచ వ్యాప్తంగా శాకాహార ఆహారాన్ని అనుసరించే వ్యక్తుల విషయంలో ఆస్ట్రియా ఐదో స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 9 శాతం మంది ప్రజలు కూరగాయలను తినేందుకే ఇష్టపడుతున్నారు.