Begin typing your search above and press return to search.

ప్ర‌పంచదేశాల్లో కింగ్ ఖాన్ ఆస్తుల విలువ ఎంతంటే?

అంబానీ త‌ర్వాత దుబాయ్ లో అత్యంత ఖ‌రీదైన విల్లాను క‌లిగి ఉన్న సెల‌బ్రిటీగా కింగ్ ఖాన్ షారూఖ్ పేరు వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   4 Sep 2023 3:30 PM GMT
ప్ర‌పంచదేశాల్లో కింగ్ ఖాన్ ఆస్తుల విలువ ఎంతంటే?
X

సెల‌బ్రిటీల దుబాయ్ విలాసాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ల‌గ్జ‌రీ అన్న ప‌దానికి దుబాయ్ ఒక ఉదాహ‌ర‌ణ‌. అక్క‌డ జీవించాలంటే సెల‌బ్రిటీల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని, కోట్లాది రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న చాలా మంది భార‌తీయ వ్యాపార‌వేత్త‌లు సొంతంగా దుబాయ్ లో విల్లాను క‌లిగి ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. దుబాయ్ లో సీ ఫేసింగ్ విల్లా క‌లిగి ఉన్న మ‌హానుభావుడిగా ముఖేష్ అంబానీ గురించి నిరంత‌రం ముంబై టాబ్లాయిడ్ల‌లో క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి.

అంబానీ త‌ర్వాత దుబాయ్ లో అత్యంత ఖ‌రీదైన విల్లాను క‌లిగి ఉన్న సెల‌బ్రిటీగా కింగ్ ఖాన్ షారూఖ్ పేరు వినిపిస్తోంది. భార్య‌, పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేసేందుకు ఖాన్ ఈ విల్లాకు వెళ్లేందుకు ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటాడు. ప్రైవేట్ పూల్, రిమోట్ కంట్రోల్ గ్యారేజీతో షారూఖ్ ఖాన్ విలాసవంతమైన దుబాయ్ బీచ్ విల్లా ఫోటోలు ఇటీవ‌ల వెబ్ లోకి వ‌చ్చాయి. ఈ అద్భుతమైన విల్లా కోసం భారీ మొత్తం ఖర్చవుతుందన‌డంలో సందేహం లేదు. SRK లైఫ్ కింగ్ సైజ్‌లో జీవించే సెల‌బ్రిటీ. అతని విలాసవంతమైన ఆస్తులలో దుబాయ్ బీచ్-వ్యూ విల్లా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

ఖాన్ ల‌ దుబాయ్ విల్లా 14,000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉంది. పామ్ జుమేరియా ఏరియాలో ఇది ఉంది. ఆరు బెడ్ రూమ్ ల‌తో ఖాన్ భార్య గౌరి అభిరుచులకు అనుగుణంగా ఇది రూపొందింది. ఇది అద్భుతమైన దుబాయ్ స్కై-లైన్ వీక్షణను కలిగి ఉంది. రెండు రిమోట్ కంట్రోల్ గ్యారేజీలు ఒక ప్రైవేట్ పూల్ ను ఈ విల్లా కలిగి ఉంది. కింగ్ ఖాన్ కి ముంబై- అలీబాగ్ ల‌తో పాటు దుబాయ్, లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లో కూడా విలాసవంతమైన గృహాలను కలిగి ఉన్నాడు. అత‌డి నివాసాల విలువ వేల కోట్లు అన్న ప్ర‌చారం ఉంది. షారూఖ్ కుటుంబానికి ముంబైలో జ‌న్న‌త్ అనే విలాస‌వంత‌మైన ఇల్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇది ప‌ర్యాట‌క ప్రాంతంగాను ప్ర‌సిద్ధి చెందింది.