47 ఏళ్ల వయసులో ఇంతటి సాహసమా..?
తాజాగా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అందరిని సర్‌ప్రైజ్ చేశాడు.
By: Tupaki Desk | 22 March 2024 4:30 PM GMTఒకప్పుడు హీరోలు పెద్దగా కష్టపడకుండా నటించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి హీరో కూడా తాము నటిస్తున్న పాత్రల కోసం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా కష్టపడి ఫిజిక్ ను మార్చుకొని ఉన్నారు. బాలీవుడ్ కు చెందిన ఎంతో మంది హీరోలు పాత్రల కోసం తమ ఫిజిక్ మార్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈసారి రణదీప్ హుడా వంతు.
ప్రస్తుతం రణదీప్ హుడా స్వతంత్ర వీర్ సావర్కర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా కోసం రణదీప్ ఏకంగా 26 కేజీల బరువు తగ్గాడు. తాజాగా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. 47 ఏళ్ల వయసులో ఇంతటి బరువు తగ్గడం పెద్ద సాహసం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కూడా పాత్ర డిమాండ్ మేరకు బరువు పెరగడం, తగ్గడం చేసిన రణదీప్ హుడా ఈసారి ఏకంగా 26 కేజీల బరువు తగ్గడంతో గుర్తు పట్టనంత మారాడు. సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ రణదీప్ షేర్ చేసిన ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. సోదరి డాక్టర్ అవ్వడంతో ఆమె ఆధ్వర్యంలో రణదీప్ బరువు తగ్గాడట.
స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో రణదీప్ హుడా డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో పాటు నటన విషయంలో కూడా మునుపెన్నడు చూడనంత వేరియేషన్స్ ను రణదీప్ హుడా చూపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు.