65 ఏజ్‌లో మన్మధుడు నాగార్జున రహస్యాలు
తాజా ఇంటర్వ్యూలో, నాగార్జున తాను వారానికి ఐదు నుండి ఆరు రోజులు ఉదయం దాదాపు గంటసేపు వ్యాయామం చేస్తానని బరువులెత్తే శిక్షణ, కార్డియో మిక్స్ కసరత్తులపై దృష్టి సారిస్తానని వెల్లడించారు.
By: Tupaki Desk | 9 Jan 2025 1:30 AM GMTకింగ్ నాగార్జున 60 ప్లస్ ఏజ్ లోను అతడు ఇప్పటికీ యువహీరోలతో పోటీపడుతూ ఫిట్ గా కనిపిస్తున్నారు. సెట్లో ఎనర్జిటిక్‌గా నటిస్తున్నాడు. వేదికలపైనా అదరగొడుతున్నాడు. అతడు ఇంకా నవమన్మధుడిగా హృదయాలను గెలుచుకుంటున్నాడు. దీనివెనక టాప్ సీక్రెట్ ఏమిటో తెలుసా?
నాగార్జున ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలనుందా? తాజా ఇంటర్వ్యూలో, నాగార్జున తాను వారానికి ఐదు నుండి ఆరు రోజులు ఉదయం దాదాపు గంటసేపు వ్యాయామం చేస్తానని బరువులెత్తే శిక్షణ, కార్డియో మిక్స్ కసరత్తులపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. ఫిట్ బాడీతో పాటు మానసిక ప్రశాంతతపైనా దృష్టి సారిస్తానని, ఈత కొట్టడం, గోల్ఫ్ వంటి క్రీడలతో సేదదీరతానని నాగ్ తెలిపారు.
ఈ ఏజ్ లోను జాగ్రత్తగా ఆహారం, వ్యాయామ దినచర్య పాటించడం వల్లనే తన ఫిజిక్‌ని కాపాడుకోగలుగుతున్నారు నాగ్. కార్డియో -ఎనర్జీ బ్యాలెన్స్ శిక్షణలను గత 30-35 సంవత్సరాలుగా చేస్తున్నానని అన్నారు. స్థిరంగా కసరత్తులు చేయడం అవసరం. అలా చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉంటానని అన్నారు. జిమ్‌కి వెళ్లకపోతే నేను వాకింగ్ లేదా ఈత కొట్టడానికి వెళ్తానని కూడా నాగార్జున తెలిపారు.
చాలా మంది వ్యాయామాన్ని దాటవేయడానికి ఎల్లప్పుడూ సాకులు చెబుతుంటారు. కానీ ఫలితం కనిపించాలంటే సమయం, శ్రమ పెట్టాల్సిందేనని నాగార్జున అభిప్రాయపడ్డారు. వర్కవుట్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ప్రయోజనాలున్నాయని అన్నారు.
నిద్ర లేవగానే వర్కవుట్ చేయడమే నా మొదటి ప్రాధాన్యత. నేను ఖచ్చితంగా వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు వర్కవుట్ చేస్తాను. నేను ఉదయం 45 నిమిషాల నుండి ఒక గంట వరకు వ్యాయామం చేస్తాను. కానీ ఇది చాలా కఠినమైనది.. తేలికైనది కాదు... అని తెలిపారు.
సరైన ఆకృతిని పొందడానికి, ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి నాగార్జున తనకు ఇష్టమైన కొన్ని ఉపాయాలను కూడా చెప్పారు. కార్డియో లేదా ఎనర్జీ శిక్షణలో మీ హృదయ స్పందనను మీ గరిష్ట రేటులో 70 శాతం కంటే ఎక్కువగా ఉండేలా చూడాలని నాగ్ చిట్కా చెప్పారు. వ్యాయామాల మధ్య ఎక్కువ విశ్రాంతి తీసుకోవద్దు. కూర్చోవద్దు, ఫోన్‌లను తీసుకెళ్లవద్దు. ఏకాగ్రతతో మీ గుండె కొట్టుకునే తీరు స్పీడ్ ఉండాలి. అది రోజంతా మీ జీవక్రియను సజావుగా ఉంచుతుంది... నేను నమ్ముతున్న ఫిట్‌నెస్ మంత్రం స్థిరత్వం. మీ శరీరానికి ప్రతిరోజూ ఒక గంట నుండి 45 నిమిషాల సమయం ఇవ్వండి. తగినంత నిద్ర చాలా ముఖ్యం.. అని టిప్స్ చెప్పారు నాగ్.