Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బెస్ట్ కపుల్ అంటే వీళ్లే..!

లేటెస్ట్ గా కియరా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా దిగిన ఒక ఫోటో

By:  Tupaki Desk   |   25 July 2023 11:06 AM GMT
బాలీవుడ్ బెస్ట్ కపుల్ అంటే వీళ్లే..!
X

బాలీవుడ్ లో చాలా ప్రేమ జంటలు పెళ్లి చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ జోడీ కట్టి ఆఫ్ స్క్రీన్ లో ప్రేమలో పడి రియల్ లైఫ్ పార్ట్ నర్స్ గా మారిపోయారు. అలాంటి వారిలో రీసెంట్ మ్యారీడ్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియరా అద్వాని కూడా చేరిపోయారు. ఇద్దరు లవ్ లో ఉన్నా ఎక్కువగా మీడియా డిస్కషన్స్ లో లేకుండానే పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్, కియరా అద్వానిల జోడీ ప్రస్తుతం బాలీవుడ్ లో బెస్ట్ జోడీగా వినిపిస్తుంది.


సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సిద్ధార్థ్, కియరా తమ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరు కలిసి దిగిన ఫోటోస్ బయటకు వస్తే చాలు అది వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా కుర్రాళ్ల కలల రాణిగా ఉన్న కియరా అద్వాని తన హస్బెండ్ తో కలిసి దిగుతున్న ఫోటోలు ఆమె ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తున్నాయి. సిద్ధార్థ్ తో పెళ్లి అని చెప్పగానే కియరా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు.

మంచి ఫాం లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్లి తర్వాత కెరీర్ రిస్క్ లో పడుతుంది కదా అని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ కియరా వాటిని ఏమి పట్టించుకోకుండా సిద్ధార్థ్ తో పెళ్లికి రెడీ అయ్యింది. ఈమధ్య కాలంలో పెళ్లైన హీరోయిన్స్ కూడా రాణిస్తున్నారు. అందుకే కియరా కూడా పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లు అందుకుంటుంది.

లేటెస్ట్ గా కియరా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్లీవ్ లెస్ టాప్, మిడ్డీతో క్యూట్ లుక్స్ తో కియరా ఆమె వెనకాలే ఆమె చేతులు పట్టుకుని గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా ఉన్న సిద్ధార్థ్ ఇద్దరు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. చూడముచ్చటైన ఈ జంట ఆడియన్స్ ని అలరిస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే కియరా అద్వాని రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తుంది. సిద్ధార్థ్ కూడా ప్రస్తుతం యోధ సినిమాలో నటిస్తున్నాడు. కియరా అద్వానికి బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ మహేష్, చరణ్ లతో నటించిన అమ్మడు అక్కడ ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది.