Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఆస్తి 10,000 కోట్ల నుంచి క‌రిగి 2300 కోట్ల‌కు!

ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్ అంబానీల ఇంట కోడ‌లు అయిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 July 2023 3:00 AM GMT
హీరోయిన్ ఆస్తి 10,000 కోట్ల నుంచి క‌రిగి 2300 కోట్ల‌కు!
X

ఆ హీరోయిన్ కి నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ దాదాపు 10,000 కోట్ల ఆస్తులు. కానీ ఇప్పుడు అవే 2,300 కోట్ల‌కు ప‌డిపోయాయి. విలాస‌వంత‌మైన‌ జీవితానికి వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు కానీ.. కీర్తి- ప‌ర‌ప‌తి బీట‌లు వార‌డం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్ ? అంటే.. టీనా మునిమ్ లేదా టీనా అంబానీ అని స్ప‌ష్ఠంగా చెప్పాలి. ఆ మేర‌కు బాలీవుడ్ మీడియాల క‌థ‌నాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్.. అంబానీల ఇంట కోడ‌లు అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌డిగా ఓ వెలుగు వెలిగిన‌ అనిల్ అంబానీని ప్రేమించిన టీనా ఆ ఇంటి కోడ‌లు అయ్యింది. నిజానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టీనా అప్ప‌ట్లోనే ప‌లువురు హీరోల‌తో ఎఫైర్లు సాగించింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. దేవానంద్ స‌హా నాటి అగ్ర హీరోల స‌ర‌స‌న స్టార్ హీరోయిన్ హోదాలో టీనా మునిమ్ న‌టించి మెప్పించారు. ఇండ‌స్ట్రీ అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అనిల్ అంబానీతో టీనా ప‌రిచ‌యం ప్రేమాయ‌ణం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారాయి. కుటుంబాల‌ నుంచి వ్య‌తిరేక‌త ఎదురైనా ఈ జంట ఏక‌మ‌వ్వ‌డం కోసం కొన్నేళ్ల పాటు సాగించిన పోరాటం అసాధార‌ణ‌మైన‌ది.

అనీల్ అంబానీతో ప‌రిచ‌యం:

అంబానీ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పటికీ బాలీవుడ్ నటి టీనా మునిమ్ అనీల్ అంబానీని కలవడానికి ముందు అత‌డి గురించి త‌న‌కు ఎలాంటి విష‌యాలు తెలియ‌వు. వారిద్దరూ గుజరాతీ కుటుంబాల నుండి వచ్చారు. అయితే టీనా సంప్రదాయానికి విరుద్ధం అయితే.. అంబానీ కుటుంబం పూర్తిగా సాంప్రదాయబ‌ద్ధ‌మైన‌ది. అనిల్ - టీనా పూర్తిగా అపరిచితులు అయినా హ్యాపీ క‌పుల్ గా మారడానికి చాలా కష్టపడ్డారు. టీనా -అనిల్ మొదట ఒక పెళ్లిలో కలుసుకున్నారు. అయితే తనకు `లవ్ ఎట్ ఫస్ట్ సైట్` తరహా ఎమోషన్ లేదని చెప్పాడు. అనిల్ నిజానికి టీనా చీర రంగు ఎంపికపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నాడు. పెళ్లి వేడుకలో మరెవరూ అలాంటి ఛాయ ఉన్న‌ శారీని ధరించలేదు.. టీనా నలుపు చీరను ధ‌రించింద‌ని అతడు ఒక ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఫిలడెల్ఫియాలో కలుసుకున్నారు. మూడో పక్షం ద్వారా టీనాకు పరిచయం అయిన అనిల్ కొన్నాళ్ల‌కు ఆమెను డేటింగ్ గురించి అడిగాడు. అనిల్ ఆఫర్ ను టీనా తిరస్కరించినప్పటికీ వారి కథ అక్కడితో ముగిసిపోలేదు. అస‌లు క‌థ ఇక్క‌డే మొద‌లైంది.

1986లో టీనా - అనిల్ జంట ప్రేమాయ‌ణం గురించి మీడియాలో నెమ్మ‌దిగా వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఆ ఇద్ద‌రూ జంట‌గా క‌లిసి పట్టుబట్టడంతో మీడియాకి మళ్లీ కనెక్ట్ అయ్యారు. అయితే కొన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత ఈసారి క‌ల‌యిక‌ వారి జీవితాల్లో ఒక మలుపు తిప్పింది. టీనా అతని గురించి తొలి అభిప్రాయాన్ని చెబుతూ ఓ సంద‌ర్భంలో ఇలా అన్నారు. ``నేను అతడిని మొదటిసారి కలుసుకున్నప్పుడు సింప్లిసిటీ చూసి ఆకర్షితురాలిన‌య్యాను. అతడు నిజాయితీగా ఉన్నతంగా కనిపించాడు.. అని అన్నారు.

కుటుంబం తిరస్కరించినా కానీ..!

టీనా-అనీల్ జంట‌ ప్రేమను వారి కుటుంబం తిరస్కరించింది. టీనాతో అనీల్ కి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడానికి అంబానీలు అస్స‌లు ఇష్టపడలేదు. కుటుంబ సభ్యులకు వివరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విధేయత గల కొడుకు కావడంతో అనిల్ తన కుటుంబాన్ని ధిక్క‌రించ‌లేక‌పోయాడు. ఆ కార‌ణంగా త‌మ ప్రేమైక జీవితానికి కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు. అయితే అనిల్ అంబానీ తన తల్లిదండ్రులు ధీరూభాయ్ - కోకిలాబెన్ అంబానీలకు పెళ్లి కాకముందే టీనా మునిమ్‌ను పరిచయం చేశారు. తనకు ప్రపోజ్ చేయడమే మీటింగ్ ఉద్దేశమని టీనాకు తెలియదు. కొద్ది సేపటికి రూమ్ నుంచి వెళ్లిన టీనాకు తన సోదరుడు ముఖేష్ అంబానీ సీక్రెట్ రివీల్ చేసేయ‌డంతో అనిల్ అంబానీ ప్రపోజల్ ప్లాన్ చెడింది.

టీనా-అనిల్ అంబానీల వివాహం

టీనా - అనిల్ నాలుగు సంవత్సరాలుగా కమ్యూనికేట్ చేయనప్పటికీ వారు ఎప్పటికీ ప్రేమలో ఉన్నారు. మరెవరితోనూ డేటింగ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. టీనాను అంబానీ కుటుంబానికి చెందిన బాహుగా అంగీకరించమని ఒప్పించేవరకు అనిల్ తన కుటుంబం నుండి అన్ని వివాహ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ పట్టుదలతో పోరాడాడు. చివ‌రికి అనుకున్న‌ది సాధించుకున్నాడు. ఆ త‌ర్వాత క‌థంతా తెలిసిన‌దే.

టీనా కుటుంబం ఆర్థికంగా ఎలా ఉన్నా.. అంబానీని పెళ్లాడాక వేల కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తి అయింది. టీనా- అనీల్ అంబానీ జంట ప్రేమ‌క‌థ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ప్రేమ‌క‌థ‌ల్లోనే ఎంతో ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచింది. పెళ్లి త‌ర్వాత‌ వేల కోట్ల‌కు టీనా అధిప‌తి. అయితే ఇటీవ‌ల‌ అనీల్ అంబానీ కంపెనీల దివాళా గురించి బ‌హిర్గ‌తం అయింది. అనీల్ అంబానీ దివాళాను అధికారికంగా ప్ర‌క‌టించ‌డం ప్ర‌పంచాన్ని నివ్వెర‌పోయేలా చేసింది. సుమారు 10,000 కోట్ల ఆస్తులు ఇప్ప‌టివ‌ర‌కూ క‌రిగి 2300 కోట్ల‌కు చేరుకున్నాయి. అయినా ఈ దంప‌తుల విలాస‌వంత‌మైన జీవితానికి ఎలాంటి భంగం లేదు.