లేటెస్ట్ అప్ డేట్.. వంశీ సేఫ్.. ఇక, ఇంటికే!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని వైపుల నుంచి ఊరట లభించింది.
By: Tupaki Desk | 2 July 2025 4:48 PM ISTవైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని వైపుల నుంచి ఊరట లభించింది. నాలుగు కేసులు దాఖలు కాగా.. వాటన్నింటికీ బెయిల్ లభించింది. అయితే.. మూడో కేసులో అంటే.. గన్నవరంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని నమోదైన కేసులో స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చినా.. ప్రభుత్వం మాత్రం దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది.
అదేవిధంగా ఈ కేసులోనే సీతామహాలక్ష్మి అనే మహిళ కూడా ఇంప్లీడ్ అయ్యారు. తన స్థలాన్ని వంశీ అను చరులు కబ్జా చేశారని ఆమె కేసు పెట్టారు. దీనిపై గన్నవరం పోలీసులు.. కేసు కట్టారు. అయితే.. దీనిని క్రిమినల్ కేసుగా పేర్కొన్నారు. దీనిలోనూ బెయిల్ వచ్చింది. అయితే.. ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ.. సీతామహాలక్ష్మి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపైనా విచారణ చేసిన కోర్టు.. అసలు సివిల్ కేసులో పోలీసులకు పనేంటని ప్రశ్నించింది.
అంతేకాదు.. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో వంశీ బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇలా.. మొత్తంగా అన్ని కేసుల్లోనూ వల్లభ నేనికిబెయిల్ లభించింది. దీంతో ఆయనను బుధవారం జైలు నుంచి పంపించనున్నారు. ఇదిలావుంటే.. గన్నవరంలో సంబరాలు చేసేందుకు కార్యకర్తలు ఏ ర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ఎ లాంటి సంబరాలకు అనుమతులు లేవని పేర్కొన్నారు.