'ఒకే చేయితో చప్పట్లు'... రే*ప్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు!
అవును... లైంగిక వేధింపుల కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.
By: Tupaki Desk | 28 May 2025 5:24 PM ISTలైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మహిళపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఒక చేయితో చప్పట్లు మోగవని పేర్కొంది!
అవును... లైంగిక వేధింపుల కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం.. ఆ మహిళ ఏమీ చిన్నపిల్ల కాదు అని.. ఒక చేయితో చప్పట్లు మోగవు అని పేర్కొంది! ఇదే సమయంలో.. అసలు ఏ ప్రాతిపదికన ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు అని పోలీసులను ప్రశ్నించింది.
ఇదే సమయంలో.. ఆమె చిన్నపిల్లేమీ కాదని.. ఆ మహిళ వయసు 40 ఏళ్లని.. వారు కలిసి జమ్మూకు వెళ్లారని.. అలాంటప్పుడు ఆ కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఆ మహిళ జమ్మూకు ఏడు సార్లు వెళ్ళినా ఆమె భర్తకు పట్టింపు ఉండదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నిందితుడ్ని ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని సూచించింది.
ఈ సందర్భంగా.. నిబంధనలు, షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో.. నిందితుడు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని పేర్కొంది. బాధిత మహిళను సంప్రదించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని పేర్కొంది.
