ఖైదీల ఫుడ్ విషయంలో ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది..
ప్రాథమిక హక్కు అనేది ప్రతి ఒక్కిరికి కల్పించాలి. అది ప్రభుత్వాలు, పాలకులు, అధికారుల విధి.
By: Tupaki Desk | 16 July 2025 3:00 PM ISTప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్ కు మాత్రమే సొంతం. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు పరిపాలించేదే ప్రజాస్వామ్యం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రూపొందించాలంటే ఆశామాషీ కాదు. అలా ఏర్పడిన రాజ్యాంగం పౌరుడి నుంచి నుంచి ఉన్నత న్యాయస్థాలకు వరకు ఆది గ్రంథంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యంగ రూపకర్తలు అందులో చాలా విషయాలను ప్రస్తావించారు. అయితే కాలానుగుణంగా ఇవి మార్పులు, చేర్పులకు గురవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేవి ‘ప్రాథమిక హక్కు’. రాజ్యాంగంలోని పార్ట్ III (ఆర్టికల్ 12-35) వరకు ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ను ఈ ప్రాథమిక హక్కులు కాపాడుతాయి.
ప్రాథమిక హక్కు అనేది ప్రతి ఒక్కిరికి కల్పించాలి. అది ప్రభుత్వాలు, పాలకులు, అధికారుల విధి. అయితే వాటి కల్పనలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటీవల సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇది చర్చకు వచ్చింది. అదేంటంటే ‘ఖైదీలకు రిచ్ పెట్టాల్సిన అవసరం లేదు’ అని కోర్టు వివరించింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంను స్పష్టంగా వివరించింది.
నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఎల్ మురుగనాథం అనే ఖైదీ తమకు మాంసం, గుడ్లు పెట్టడం లేదని ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, తమకు మాసం, గుడ్లు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ పిల్ ను స్వీకరించిన కోర్టు విచారించింది. జైలులో ఉన్న ఖైదీలకు రిచ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదని, కేవలం పోషకాలు ఉన్న ఆహారం పెడితే సరిపోతుందని వివరించింది. ఇది వికలాంగ ఖైదీలకు కూడా వర్తిస్తుందని వివరించింది. ఖరీదైన ఆహారం పొందే అర్హత ఖైదీలకు లేదని జేబీ పార్డివాలా, ఆర్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆర్టికల్-21 ప్రకారం ఖైదీలకు జీవించే హక్కు ఉంటుందని, వారు కోరిన, విలాసవంతమైన ఆహారం (రిచ్ ఫుడ్) ఎంచుకునే హక్కు వారికి లేదని న్యాయమూర్తులు చెప్పారు. వారు ఇష్టపడిన, రిచ్ ఫుడ్ అందచకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేమని స్పష్టం చేసింది. జైల్లు సౌకర్యాలు కల్పించేందుకు లేవని, దిద్దుబాటు సంస్థలు అని న్యాయస్థానం పేర్కొంది. ఆరోగ్య పరంగా.. గౌరవానికి భంగం వాటిల్లనంత వరకు మాత్రమే సౌకర్యాలు ఉంటాయిని కోర్టు స్పష్టం చేసింది. తృప్తి కరమైన, అవసరం లేని వస్తువులను సరఫరా చేయకపోవడం ప్రాథమిక హక్కుల హరణం, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని ప్రభుత్వం పేర్కొంది.
