Begin typing your search above and press return to search.

ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి షాక్.. మళ్లీ విచారణకు సుప్రీం ఆదేశం

ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెందురైంది.

By:  Tupaki Desk   |   7 May 2025 5:30 PM
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి షాక్.. మళ్లీ విచారణకు సుప్రీం ఆదేశం
X

ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెందురైంది. ఈ కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పున సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. 3 నెలల్లో మరోసారి విచారణ చేపట్టాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి 2022లో శ్రీలక్ష్మీని డిశ్చార్జ్ చేశారు. దీనిపై సీబీఐ అప్పీలు చేయగా, తాజాగా తీర్పు వెలువడింది. కాగా, ఇదే కేసులో నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మంగళవారంమే హైదరాబాదులోని సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే ఈ కేసులో శ్రీలక్ష్మిని తప్పించాడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి, సహ నిందితులు బీ.వీ.శ్రీనివాసరెడ్డి, వి.డి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ ను నిందితులుగా తేల్చింది. ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.

ప్రభుత్వ ఉద్యోగి అయిన వి.డి.రాజగోపాల్ కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. నిందితుల జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితురాలు అయినప్పటికీ 2022లో డిశ్చార్జి చేశారు. అయితే సుప్రీం తీర్పుతో ఆమె మళ్లీ విచారణను ఎదుర్కోవాల్సివుంటుంది.

ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న వై.శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆమెను గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పట్టుబట్టి మరీ రాష్ట్రానికి రప్పించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ అక్రమాస్తులు సంపాదించుకునేలా ఆమె సహకరించారని టీడీపీ ఆరోపిస్తోంది.