ఎందుకు? కోర్టుకు వైట్ షర్టు.. బ్లాక్ ఫ్యాంట్ తో రావొద్దు
ఢిల్లీలోని రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ సరికొత్త ఆదేశాల్ని జారీ చేశారు. జిల్లా కోర్టు సముదాయానికి తెల్లచొక్కా.. నల్ల ఫ్యాంటు వేసుకొని రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
By: Tupaki Desk | 17 July 2025 10:15 AM ISTకోర్టుకు డ్రెస్ కోడ్ పెట్టొచ్చా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. అసలు విషయం తెలిస్తే.. అలాంటి చర్యలు తప్పు కావన్న అభిప్రాయం కలుగుతుంది. న్యాయస్థానానికి ఫలానా రంగు చొక్కా.. ఫలానా రంగు ఫ్యాంటు వేసుకొని రావొద్దంటూ ఆదేశాలు జారీ చేస్తారా? అలా సాధ్యమేనా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. సదరు కోర్టుకు చెందిన బార్ ఆదేశాల వెనుక అసలు ఉద్దేశం తెలిసినప్పుడు.. ఇలాంటి ఆదేశాన్ని ఒక్క కోర్టు కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు ప్రాంగణాల్లో అమలు చేయటం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం కాక మానదు.
అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ సరికొత్త ఆదేశాల్ని జారీ చేశారు. జిల్లా కోర్టు సముదాయానికి తెల్లచొక్కా.. నల్ల ఫ్యాంటు వేసుకొని రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణం కోర్టుకు వచ్చే వారిలో పలువురు న్యాయవాదుల మాదిరి తెల్ల చొక్కా.. నల్లఫ్యాంటు వేసుకొని తమను తాము న్యాయవాదులుగా న్యాయవాదుల గుమస్తాలుగా పేర్కొంటున్న దుస్థితి. దీంతో.. పలువురు మోసపోతున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమ ప్రొఫెషన్ లో భాగంగా లాయర్లను గుర్తించేందుకు వీలుగా వారు ధరించే తెల్ల చొక్కా.. నల్ల ఫ్యాంటునుకోర్టు ప్రాంగణంలోకి రాకూడదన్న నిర్ణయాన్ని తాము తీసుకున్నట్లుగా రోహిణి కోర్టు న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) నిర్ణయాన్ని తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు మాత్రమే తెల్లచొక్కా.. నల్ల ఫ్యాంటు వేసుకొని కోర్టు ప్రాంగణంలోకి రావొచ్చని పేర్కొంది. నిజానికి ఈ సమస్య చాలా కోర్టుల్లో ఉంటుంది. అందుకే.. ఈ తరహా నిర్ణయాన్ని దేశంలోని పలు బార్ అసోసియేషన్లు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
