Begin typing your search above and press return to search.

మరణించిన కొడుకు వీర్యం కోసం కోర్టును ఆశ్రయించిన తల్లి!

అవును... చనిపోయిన తమ కుమారుడి ఘనీభవించిన వీర్యాన్ని ఉపయోగించి, తమ కుటుంబ వంశపారంపర్యతను కొనసాగించడానికి అవకాశం కల్పించాలని కోరుతూ అతని తల్లి పిటిషన్ దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 3:48 PM IST
మరణించిన కొడుకు వీర్యం కోసం కోర్టును ఆశ్రయించిన తల్లి!
X

కుటుంబ వంశపారంపర్యతను కొనసాగించడానికి చనిపోయిన కుమారుడి వీర్యాన్ని నాశనం చేయకుండా తమకు అప్పగించాలని కోరుతూ ఓ తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగా... వివాహం కాకుండానే తన కుమారుడు క్యాన్సర్‌ తో మృతిచెందాడని, ఈ పరిస్థితుల్లో కుటుంబ వారసత్వాన్ని నిలుపుకొనేందుకు వాటిని తమకు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని ఆ పిటిషన్ లో అభ్యర్థించారు.

అవును... చనిపోయిన తమ కుమారుడి ఘనీభవించిన వీర్యాన్ని ఉపయోగించి, తమ కుటుంబ వంశపారంపర్యతను కొనసాగించడానికి అవకాశం కల్పించాలని కోరుతూ అతని తల్లి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ముంబై హైకోర్టు... ఈ పిటిషన్ పై విచారణ జరిగే వరకు, ఆ వ్యక్తి వీర్యాన్ని భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నగరంలోని ఒక సంతానోత్పత్తి కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే... తన కుమారుడు కుటుంబాన్ని సంప్రదించకుండానే మరణానంతరం వీర్యాన్ని నాశనం చేయమని సమ్మతి పత్రాలపై సంతకం చేశారని సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్‌) పేర్కొంది! దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్‌ మనీష్‌ పటేల్‌ ఏకసభ్య ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు వీర్యాన్ని కాపాడాల్సిందేనని సంతాన సాఫల్య కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది.

తదుపరి విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో... అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం - 2021లోని నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని వీర్యాన్ని ఎలా సంరక్షించాలనే దానిపై ఈ పిటిషన్ ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని ధర్మాసనం పేర్కొంది. ఫిబ్రవరిలో మరణించే సమయానికి ఆ వ్యక్తి అవివాహితుడని కోర్టు నొక్కి చెప్పింది.

ఈ సందర్భంగా స్పందించిన న్యాయవాదులు.. ఆ యువకుడి కుటుంబంలో కేవలం మహిళా బంధువులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. అతని తండ్రి 45 సంవత్సరాల వయసులో, అతని మామ 21 సంవత్సరాల వయసులో మరణించారని.. ఇప్పుడు ఇతడు 21 సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారని.. అతని వీర్యం ద్వారా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని పిటిషనర్ భావిస్తున్నారని వెల్లడించారనొ తెలిపారు.