బాధ్యత లేదు, కోరిక లేదని భర్తపై ఫిర్యాదు... హైకోర్టు కీలక తీర్పు!
అవును... తన భర్త తనతో శారీరక సంబంధాలు లేదా పిల్లలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపడం లేదని భార్య ఆరోపించింది.
By: Tupaki Desk | 1 April 2025 1:00 PM ISTతన భర్త కొన్ని మూఢ నమ్మకాల కారణంగా తనతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం లేదని.. పిల్లలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపించడం లేదని ఆరోపిస్తూ.. ఇలా అటు బాధ్యత, ఇటు కోరిక లేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది.
అవును... తన భర్త తనతో శారీరక సంబంధాలు లేదా పిల్లలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపడం లేదని భార్య ఆరోపించింది. దీంతో.. ఆమెకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబి స్నేహలతలతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా... కుటుంబ జీవితంపై భర్తకు ఆసక్తి లేకపోవడం అతన్ని వైవాహిక విధులను నిర్వర్తించడంలో వైఫల్యాన్ని సూచిస్తుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ సందర్భంగా గతంలో భార్య దాఖలు చేసిన పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల మంజూరు తీర్పును సమర్థించింది.
వాస్తవానికి గతంలో ఫ్యామిలీ కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేయగా.. భర్త ఆ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే... తన భర్త సె*క్స్ కు దూరంగా ఉండటమే కాకుండా.. పీజీ కోర్సులో చేరడానికి నిరాకరించాడని, మూఢనమ్మకాలు ఆధారంగా జీవితం గడపాలని బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది.
ఇదే సమయంలో తన భర్త తరచూ తీర్థయాత్రలకు వెళ్తాడని.. ఆ సమయంలో తనను ఒంటరిగానే వదిలేస్తున్నాడని కూడా ఆమె తన పిటిషన్ లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేయగా.. ఆ తీరుపును హైకోర్టు సమర్థించింది!
