Begin typing your search above and press return to search.

ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట గొంతు కోసుకున్నాడు

ఆ సమయంలో కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిలాయ్ విపిన్ చంద్ర అంజరియా ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 April 2024 7:30 AM GMT
ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట గొంతు కోసుకున్నాడు
X

అనూహ్య పరిణామం ఒకటి కర్ణాటక హైకోర్టు చోటు చేసుకుంది. న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్లే తీరుకు భిన్నంగా.. తానెంతగా ప్రయత్నం చేస్తున్నా న్యాయం లభించటం లేదన్న వేదనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట కత్తితో గొంతు కోసేసుకున్న షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు అక్కడి న్యాయవాదులు.. సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టింది.

అయితే.. ప్రధాన న్యాయమూర్తి ఎదుట గొంతుకోసుకున్న వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు.. అందుకుదారి తీసిన కారణం మీద మాత్రం వివరాలు ఏవీ బయటకు రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం మైసూరుకు చెందిన శ్రీనివాస్ బుధవారం బెంగళూరులోని హైకోర్టుకు చేరుకున్నారు. ఉదయం కోర్టుకు వచ్చిన వ్యక్తి హాలు ప్రవేశ ద్వారం వద్ద విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందికి ఒక ఫైల్ అందించారు.

ఆ సమయంలో కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిలాయ్ విపిన్ చంద్ర అంజరియా ఉన్నారు. అనూహ్య రీతిలో ఆయన ఎదుటకు వచ్చిన శ్రీనివాస్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ హఠత్పారినామానికి ఖంగుతిన్న ప్రధాన న్యాయమూర్తి.. న్యాయవాదులుబయటకు వెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ తరహా ఉదంతం చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఒక వ్యక్తి కత్తి తీసుకొని ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్ వరకు రావటాన్ని సీజే సీరియస్ అయ్యారు. భద్రతా చర్యల మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన రీతిలో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.